Gossipsబిగ్‌బాస్‌లో గంగ‌వ్వ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా..!

బిగ్‌బాస్‌లో గంగ‌వ్వ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా..!

బిగ్‌బాస్ 4 సీజ‌న్ రెండో వారంలోకి అడుగు పెట్టింది. అంద‌రి కంటెస్టెంట్ల కంటే గంగ‌వ్వ హైలెట్ అవుతోంది. గంగ‌వ్వ‌కు హౌస్‌లోకి వెళ్ల‌క‌ముందే తిరుగులేని క్రేజ్ ఉంది. ఇక తొలి వారం ఎలిమినేష‌న్లో ఉన్న గంగ‌వ్వ‌కు ఏకంగా 2.5 కోట్ల ఓట్లు వ‌చ్చాయి. మొత్తం 5 కోట్లు ఓట్లు పోల్ అయితే అందులో స‌గం గంగ‌వ్వ‌కే వ‌చ్చాయి. దీనిని బట్టి గంగ‌వ్వ క్రేజ్ ఏంటో తెలుస్తోంది. ఇక రెండో వారంలో కూడా ఆమె ఎలిమినేష‌న్లో ఉన్నారు. అయితే గంగ‌వ్వ చాలా సులువుగానే ఎలిమినేన్ గండం గట్టెక్కేస్తుంద‌ని అంద‌రూ భావిస్తున్నారు.

Bigg Boss: Gangavva to give unexpected twist బిగ్ బాస్: అభిమానులకు  షాకిచ్చిన గంగవ్వ - Great Telangaana

రెండో వారం ఎలిమినేష‌న్లో ఉన్నా కూడా గంగ‌వ్వ‌కు భారీగా ఓట్లు పోల‌వుతున్నాయంటున్నారు. తెలంగాణ‌లోని చొప్ప‌దండి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ఓ ప‌ల్లెటూరుకు చెందిన వృద్ధురాలు ఇంత క్రేజ్‌తో హౌస్‌లోకి వెళ్ల‌డం అంటే మామూలు విష‌యం కాదు. గంగ‌వ్వ కోసం బిగ్‌బాస్ షోకు క్రేజ్ వ‌చ్చంది అన‌డంలో సందేహం లేదు. ఇక గంగ‌వ్వ రెమ్యున‌రేష‌న్ విష‌యానికి వ‌స్తే ఆమెకు వారానికి మూడు ల‌క్ష‌లు ఇస్తున్నార‌ట‌. ఆమె ఎన్ని వారాలు హౌస్‌లో ఉంటే అన్ని రు. 3 ల‌క్ష‌లు ఆమెకు రెమ్యున‌రేష‌న్‌గా ఇచ్చేలా ఒప్పందం కుదిరింద‌ట‌.

How a village grandmother became a YouTube sensation - CNN

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news