సినిమా ఇండస్ట్రీలో వారసత్వంగా వచ్చి తమను తాము ప్రూవ్ చేసుకుని నటనతో దూసుకు వెళ్ళిన వారు ఎంతోమంది ఉన్నారు. కెరీర్ ప్రారంభంలో అడపాదడపా విజయాలు సాధించినా ఆ తర్వాత సరైన హిట్లు లేక ఫేడ్ అవుట్ అవుతూ వస్తున్నారు. మరి కొందరు బుల్లి తెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ లిస్టులో కి వస్తాడు హీరో వరుణ్ సందేశ్. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన వరుణ్ కు ప్రారంభంలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది.
కొత్త బంగారులోకం, కుర్రాడు, మరోచరిత్ర, ఏమైంది ఈ వేళ, పాండవులు పాండవులు తుమ్మెద లాంటి సినిమాలు చేశాడు. కొత్త బంగారులోకం ఒకటి రెండు సినిమాలు తప్ప మిగిలిన సినిమాలు ఆడలేదు. దీంతో సినిమాలు తగ్గించుకున్న వరుణ్ ప్రస్తుతం సొంతంగా వ్యాపారం చేసుకుంటున్నాడు. బిగ్ బాస్ త్రీ సీజన్ లో వరుణ్ సందేశ్ అతడి భార్య వితిక సందడి చేశారు. ఇక వరుణ్ బాబాయ్ కూడా నటుడే. జీడిగుంట శ్రీథర్ బుల్లితెర నటుడిగా రాణించడంతో పాటు ఆంధ్రజ్యోతికి వ్యాసాలు కూడా రాశాడు.
తులసీదళం సిరియల్‌తో కెరీర్ ప్రారంభించి దూసుకుపోయాడు. కొన్ని సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్ రోల్స్ కూడా చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. వరుణ్ తాత జీడిగుంట శ్రీరామ చంద్రమూర్తి సైతం బుల్లితెరపై రైటర్‌గా విజయవంతం అయ్యారు. ఇంత మంచి సపోర్టింగ్ ఉండి కూడా వరుణ్ రాణించలేకపోయాడు.