కొద్ది రోజులుగా ధరల మోతతో వాహనదారులు వాహనాలు బయటకు తీయాలంటేనే భయపడే పరిస్తితి వచ్చింది. అయితే ఎట్టకేలకు ఇంధన ధరలు క్రమక్రమంగా తగ్గుతున్నాయి. వరుసగా మూడో రోజు కూడా ఇంధన ధరల రేట్లు తగ్గాయి. గురువారం పెట్రోల్, డిజిల్ రేట్లు 13-20 పైసలు తగ్గించాయి. ఇండియన్ అయిల్ కార్పొరేషన్ సమాచారం ప్రకారం చూస్తే ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రు. 81.55 నుంచి రు. 81.40కు తగ్గింది. ఇక లీటర్ డిజీల్ రేటు రు 72.56 నుంచి రు. 72.37కు దిగి వచ్చింది.
దేశంలోని పలు మెట్రో నగరాల్లో ఇంధన ధరలు చూస్తే ఢిల్లీ లోపెట్రోలు ధర 81.40 డీజిల్ ధర 72.37 – కోల్‌కతాలో పెట్రోలు ధర రూ. 82.92 డీజిల్ ధర 75.87 – ముంబైలో పెట్రోలు ధర రూ. 88.07 డీజిల్ ధర 78.85 – చెన్నైలో పెట్రోలు ధర రూ. 84.44 డీజిల్ ధర 77.73 గా ఉంది.