Newsపెళ్లి చేసుకుని బంప‌ర్ జాక్‌పాట్ కొట్టండి... ఇంత‌కు మించిన ఆఫ‌ర్ ఉండ‌దుగా...!

పెళ్లి చేసుకుని బంప‌ర్ జాక్‌పాట్ కొట్టండి… ఇంత‌కు మించిన ఆఫ‌ర్ ఉండ‌దుగా…!

పెళ్లి చేసుకుంటే ఏకంగా ప్ర‌భుత్వం నుంచి రు. 4.5 ల‌క్ష‌ల ప్రోత్సాహ‌కాలు వ‌స్తాయంటే అది ఎంత బంప‌ర్ జాక్‌పాటో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. మ‌రి ఆ దేశం ఎక్క‌డో ఆ ఆఫ‌ర్ విశేషాలు ఏంటో చూద్దాం. ప్ర‌పంచంలోనే వ‌యోః వృద్ధులు ఎక్కువుగా ఉన్న జ‌పాన్‌లో ప్ర‌స్తుతం 12.68 కోట్ల జ‌నాభా మాత్ర‌మే ఉండ‌గా… ఆర్థిక స‌మ‌స్య‌ల వ‌ల్ల అక్క‌డ యువ‌కుల‌కు పెళ్లి కావ‌డం లేదు.

 

యువ‌కులు కూడా సెటిల్ కాక‌పోవ‌డంతో పెళ్లి చేసుకోవ‌డానికి ముందుకు రావ‌డం లేదు. దీంతో జ‌నాభా కూడా త‌గ్గిపోతోంది. అక్క‌డ గ‌త సంవ‌త్స‌రం కేవ‌లం 8.65 ల‌క్ష‌ల మందే జ‌న్మించారు. ఇక మ‌ర‌ణించిన వారు 14 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉన్నారు. ఇక 100 సంవ‌త్స‌రాలు దాటిన వృద్ద జ‌నాభా ప్ర‌పంచంలోనే అత్య‌ధికంగా అక్క‌డ ఉంది. పరిస్థితి ఇలాగే ఉంటే 2040 కల్లా జపాన్ జనాభాలో ఇప్పుడున్న ముసలి వాళ్ల సంఖ్య కంటే 35 శాతం ఎక్కువగా ఉంటుందని అంచనా.

 

దీంతో ఈ ప‌రిస్థితి స‌ర్దుబాటు చేసేందుకు ప్ర‌భుత్వం రంగంలోకి దిగింది. యువ‌కులు పెళ్లి చేసుకుంటే భారీ ప్రోత్సహకాలను అందిస్తోంది. కానీ పెళ్లి చేసుకునే వారి వయస్సు 40 సంవత్సరాలు మించకూడదని నిబంధన విధించింది. అలాంటి వారికి ఏకంగా రు 4.5 ల‌క్ష‌ల ప్రోత్సాహ‌కం ఇస్తుంది. ఒక్క జ‌పాన్ మాత్ర‌మే కాదు. ఇటలీ, ఇరాన్, ఎస్తోనియా(యూరోప్) వంటి దేశాలు కూడా యువత పెళ్లి చేసుకోవడానికి కొన్ని ప్రోత్సాహక పథకాలు అమలు చేస్తున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news