తెలుగు బిగ్‌బాస్ 4 సీజన్ ప్రారంభమవ్వడంతో పాటు తొలి వారం పూర్తి చేసుకుంది. ఇప్పటికే డైరెక్టర్ సూర్య కిరణ్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. ఇక తొలి వారం పోలైన ఓట్లు 5 కోట్లు అని హోస్ట్ నాగార్జున ప్రకటించాడు. అందులో సగం గంగవ్వ కోసమే పోలయ్యాయంటున్నారు. గంగవ్వకు యూట్యూబర్‌గా మంచి ఫాలోయింగ్ ఉన్న మాట వాస్తవం. చొప్పదండి నియోజకవర్గంలోని ఓ మారుమూల లంబాడీ పల్లెకు చెందిన గంగవ్వ ఈ స్థాయిలో పాపులర్ అయ్యి బిగ్‌బాస్‌కు వెళ్లడం అంటే మామూలు విషయం కాదు.
అయితే ఆమె ఎక్కువ రోజులు హౌస్‌లో ఉండేందుకు ఇష్టంతో లేదని ఆమె మాటలను బట్టి ఇట్టే అర్థమవుతోంది. ఓ వైపు ఆమె అభిమానులు మాత్రం ఆమెను మరిన్ని ఎక్కువ రోజులు… ఇంకా చెప్పాలంటే ఆమెను ఫైనల్ వరకు ఉంచే పరిస్థితి ఉంది. అయితే గంగవ్వ మాత్రం తాను ఉండలేకపోతున్నా అని తన మనస్సులో మాట బయట పెట్టేసింది. కొందరు ఆమె వల్ల షోలో ఎంటర్టైన్మెంట్ బాగుందని అంటే.. మరి కొందరు మాత్రం ఆమె వల్ల బిగ్ బాస్ షో ఫార్మాట్ చెడిపోతుందన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వచ్చే వారం నుంచి ప్రారంభమయ్యే టాస్కులలో కంటెస్టెంట్లు హోరాహోరీగా బల ప్రదర్శనతో తలపడనున్నారట. ఆ టాస్క్ లను గంగవ్వ చేయడం సాధ్యం కాదు. ఆమె కంటెస్టెంట్‌గా ఉన్న ఏ టాస్క్ కూడా చేయలేని పరిస్థితి. దీని వల్ల ఇతర కంటెస్టెంట్లు ఎఫెక్ట్ అయ్యి టాస్క్‌ల్లో పోటీ తత్వం కొరవడుతోందని కొందరు కామెంట్ చేస్తున్నారు. అయితే ఆమెను ఎవరు చిన్న కామెంట్ చేసినా ఆ కంటెస్టెంట్‌కు పేలిపోవడం ఖాయం. అంతలా గంగవ్వ ఆర్మీ ఉంది. అయితే బయట ఆమె అభిమానులు, ఆర్మీ ఆమెను వీలైనన్ని ఎక్కువ రోజులు హౌస్‌లో ఉంచాలనుకుంటున్నా గంగవ్వ మాత్రం ఎందుకో అక్కడ వారితో సర్దుకోలేకపోతున్నట్టే ఉంది.