నర్గీస్ ఫక్రీ ఈ ఇండో వెస్ట్రన్ బ్యూటీ గురించి బాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇంతియాజ్ అలీ – రన్బీర్ కపూర్ల రాక్ స్టార్ లాంటి సినిమాలతో ప్రేక్షకులు బాగా పరిచయం అయిన ఆమె కింగ్ ఫిషర్ మోడల్‌గా నేషనల్ వైడ్‌గా ఓ రేంజ్లో పాపులర్ అయ్యింది. ఆ తర్వాత ఆమె బాలీవుడ్లో యష్ చోప్రా కుమారుడైన ఉదయ్ చోప్రాతో డేటింగ్ చేసిందని ప్రచారమైంది. కానీ ఆ డేటింగ్ వ్యవహారంతో పాటు ఆమె కూడా కనుమరుగైంది. బాలీవుడ్‌కు కూడా దూరమైంది.
ఇక ఇప్పుడు ఆమె విదేశీ యాత్రలకే పరిమితం అయ్యింది. తాజాగా ఆమె ఓ ఇంట్రస్టింగ్ ఫొటో షేర్ చేసి ఇంట్రస్టింగ్ క్యాప్షన్ పెట్టింది. మీరు ఇప్పుడు ఆశించిన వాటిలో ఒకప్పుడు మీరు మాత్రమే కలిగి ఉన్నారని మీరు గుర్తుంచుకోనిదాన్ని కోరుకోవడం ద్వారా మీ వద్ద ఉన్నదాన్ని పాడుచేయవద్దు అనే కామెంట్ పెట్టింది. ఇక ప్రస్తుతం ఆమె టోరబాజ్ సినిమాలో చేస్తోంది.
కరోనా కారణంగా ముంబై వదిలేసిన నర్గీస్ న్యూయార్క్ సిటీలో ఉంటోంది. జోషువా నేషనల్ ట్రీ పార్క్ లో సందడి చేసిన ఫొటోలు కూడా ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో ఆమె ముళ్ల చెట్ల మధ్య అందాలు ఒలికిస్తూ ఫొటోలకు పోజులు ఇచ్చింది.