Newsప్రియుడు ఇంట్లో కూతురు.. తండ్రి చేసిన ప‌నితో అంద‌రూ షాక్‌

ప్రియుడు ఇంట్లో కూతురు.. తండ్రి చేసిన ప‌నితో అంద‌రూ షాక్‌

వివాహేత‌ర సంబంధాలు, ప్రేమ‌లు ఎంతో మంది ప్రాణాల‌ను బ‌లి తీసుకుంటున్నాయి. ఈ క్ర‌మంలోనే త‌న కుమార్తె ప్రియుడితో ఉంటాను అని చెప్పి వెళ్లిపోవ‌డంతో ఆమె తండ్రి ఉన్మాదిగా మారి కుమార్తెను చంపేశాడు. యూపీలోని కాన్పూర్ ప‌క్క‌న‌ దేహ‌త్ జిల్లాలో జ‌రిగిన ఈ సంఘ‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి. కన్పన్న గ్రామానికి చెందిన యువతి… గ్రామంలో కిరాణా షాప్ నడుపుతున్న ఓ యువకుడిని ప్రేమించింది. అర్ధరాత్రి ప్రియుడి ఇంటికి వెళ్లిన ఆ యువ‌తి తాను అక్క‌డే ఉంటాన‌ని.. ఇంటికి రాన‌ని చెప్పింది.

 

అయితే ఆ యువ‌తి కుటుంబ స‌భ్యులు ఆమె ఉన్న ప్రియుడి ఇంటికి వెళ్లి తిరిగి రావాల‌ని కోరారు. దీంతో ఆమె తండ్రితోనే వాగ్వివాదానికి దిగింది. దీంతో ఆ యువ‌తి తండ్రి క‌న్న కుమార్తె అని చూడకుండా గొడ్డ‌లితో అక్క‌డిక‌క్క‌డే న‌రికేశాడు. ప్రియుడి ఇంటి ముందే ఆమె కుప్పకూలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మ‌ధ్య‌లో అడ్డు వ‌చ్చిన ప్రియుడిని కూడా న‌ర‌క‌డంతో అత‌డు తీవ్ర గాయాల‌తో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news