ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో జీవితకాల నిషేధం ఎదుర్కొన్న క్రికెటర్ శ్రీశాంత్ పై నిషేధం సుప్రీంకోర్టు చొరవతో కుదించబడడంతో ఆదివారం శ్రీశాంత్ జైలు నుంచి విడుదలయ్యాడు. ఇక శ్రీశాంత్‌కు ఆమె భార్య ఎప్పుడూ అండగా ఉన్నారు. ఆమె ఇచ్చిన మనో ధైర్యంతోనే శ్రీశాంత్ అవసరం అయితే మళ్లీ మైదానంలోకి వచ్చేందుకు రెడీగా ఉన్నాడు. శ్రీశాంత్ భార్య ఎవరో కాదు దివాన్‌పూర్ రాజకుమారి భువనేశ్వరి. 2013లో దివాన్‌పూర్ రాజకుమారి అయిన భువనేశ్వరితో శ్రీశాంత్ పెళ్లి ఏర్పాట్లు జరుగుతుండగా అతడిపై నిషేధ ప్రకటన వచ్చింది.
శ్రీశాంత్ తల్లిదండ్రులు మౌనంగా ఉన్నా భువనేశ్వరి తల్లిదండ్రులే ధైర్యంగా కొచ్చి వెళ్లి ఈ పెళ్లి ఆగడం లేదని చెప్పారు. ఒకవేళ శ్రీశాంత్, భువనేశ్వరిలది ప్రేమ వివాహం కాకపోయుంటే ఒకే ఒక కారణంతో ఆ పెళ్లి ఆగిపోయి ఉండేది. రాజస్థాన్ రాజకుటుంబం తమ కుమార్తె ప్రేమే ముఖ్యం అనుకుంది. 24 ఏళ్ల వయస్సులో శ్రీశాంత్ రాజస్థాన్‌లో మ్యాచ్ ఆడేందుకు వెళ్లినప్పుడు పదో తరగతి చదువుతోన్న భువనేశ్వరి మ్యాచ్‌లో శ్రీశాంత్‌ని చూస్తూ చూస్తూ ప్రేమలో పడిపోయింది.
అయినా శ్రీశాంత్‌కు ఆమె ఎంతో మానసిక బలాన్ని ఇచ్చి ఎప్పుడూ సపోర్ట్ చేసింది. భువనేశ్వరి శ్రీశాంత్‌కు ఎంత సపోర్టింగ్‌గా ఉండేవారంటే హిందీ బిగ్‌బాస్ షోలో వారాంతంలో అతడిని ఆమె కలవడానికి రావడం దేశం అంతా చూసిందే. అప్పుడే వాళ్ల ప్రేమ గుట్టు విప్పారు. ఇక భువనేశ్వరి 15 ఏటనే శ్రీశాంత్‌ను ప్రేమిస్తే శ్రీశాంత్ ఆమెకు 20వ యేడు వచ్చే వరకు ఆగి అప్పుడు ఆమెను ప్రేమించడం మొదలు పెట్టాడు. అప్పటి వరకు ఫోన్లోనే వారు మాట్లాడుకునే వారు. శ్రీశాంత్‌పై విమర్శలు వచ్చినప్పుడు ఆమె అతడికి మరింత ధైర్యం ఇస్తూ వస్తోంది. ఈ దంపతులకు కూతురు శాన్విక, కొడుకు సూర్య శ్రీ ఉన్నారు.