ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డికి, వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి కోర్టుల్లో వరుసగా ఎదురు దెబ్బలు తగులుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బుధవారం జగన్‌కు మరో కోర్టు దెబ్బ తగిలింది. గత ప్రభుత్వ నిర్ణయాలన్నీంటిని పునఃసమీక్షించాలంటూ వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) విచారణపై హై కోర్టు స్టే ఇచ్చింది. టీడీపీ నేతలు ఆలపాటి రాజా, వర్ల రామయ్యలు ఈ పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం ఈ మేరకు స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
రఘురామ్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు అయిన ఈ సిట్‌కు ప్రభుత్వం ప్రత్యేక అధికారాలు కూడా కట్టబెట్టింది. అయితే టీడీపీ నేతలు రాజా, వర్ల రామయ్య పోలీస్ స్టేషన్‌కు ఉన్న అధికారాలు సిట్‌కు కట్టబెట్టడం న్యాయం కాదంటూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై బుధవారం విచారణ జరిపిన న్యాయస్థానం ఇరువైపుల వాదనలు విన్న అనంతరం సిట్‌పై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఏదేమైనా జగన్‌కు కోర్టుల్లో వరుస షాకులు తప్పడం లేదు. అనాలోచితమన నిర్ణయాలతో వరుసగా మెట్టికాయలు పడుతున్నాయన్న టాక్ బలంగా వినిపిస్తోంది.