– ఆక్సిజన్ సిలిండర్ల అందజేత
– సామాజిక బాధ్యతలో భాగంగా
ముందుకువచ్చినందుకు అభినందన
– యూరప్ విభాగం చేయూతతో ముందడుగు
– సమన్వయ బాధ్యతల్లో శ్రీకాకుళం జన సైనికులు
– రాష్ట్ర వ్యాప్తంగా 400కు పైగా సిలిండర్ కిట్ల అందజేత
– శ్రీకాకుళం జిల్లా జనసైనికులు వెల్లడి
ప్రతి పుట్టిన రోజూ పండుగే..ప్రతి రోజూ ఆ దీపాల కాంతుల చెంత ఆనందాలే..అలాంటి రోజున తమ ప్రియమయిన అధినేత,జనసే నాని పవన్ కల్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు అభిమానులు దాతృత్వం చాటారు. మానవతను నిలుపుకున్నారు. తమ పరిధిలో ఈ పుట్టిన రోజు వేడుకను వారోత్సవాలుగా మలిచి కరోనా బాధితులకు అండగా నిలిచేందుకు ఆక్సిజన్ సిలిండర్ కిట్ల పంపిణీకి సమాయత్తం అయ్యారు. ఆ సన్నాహకాలను ఆ ప్రణాళికలనూ అమలు చేసి కలెక్టర్ నివాస్ ను కలుసుకుని వేర్వేరు సందర్భాల్లో 17 కిట్లను అందించారు. ఇందుకు జన సేన పార్టీ శ్రీకాకుళం జిల్లా విభాగ నాయకులూ, అదేవిధంగా యూరప్ విభాగ నాయకులూ ముందుకు వచ్చి తమ సామాజిక బాధ్యతను నిర్వర్తించి, అధినేత పై తమకు ఉన్న ప్రేమను చాటుకున్నారు. ఆ వివరాలివి..
జనసేనాని పవన్ కల్యాణ్ పుట్టిన రోజును పురస్కరించుకుని సామాజిక బాధ్యతగా శ్రీకాకుళం జనసైనికుల స మన్వయంతో కలెక్టర్ నివాస్ కు ఐదు ఆక్సిజన్ సిలిండర్ కిట్లు అందించారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో తమ వంతుగా బాధ్యత నిర్వర్తించి మానవతను చాటుకున్న ఈ సైనికులకు తన తరఫున కలెక్టర్ నివాస్ అభినందనలు తెలిపారు. మొ న్నటి వేళ కూడా జనసైనికులు తమ వంతుగా 12 కిట్లు అందించి, తమ కర్తవ్య దీక్షను చాటుకున్న వైనాన్ని ఈ సందర్భంగా గు ర్తు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తమ అభిమాన అధినేత పిలుపు మేరకు స్పందించి, శ్రీకాకుళం సైనికులు అంతా కదిలివచ్చి, సిలిండర్ల కొనుగోలు ప్రణాళిక రచించి, అమలు చేయడం ఆనందదాయకమేనని, అక్కడితో ఆగక సమస్య తీవ్రతను గుర్తించి యూరప్ జనసేన విభాగంను సైతం బృహత్తర కార్యక్రమంలో భాగం చేయడం ఎంతైనా ప్రశంసనీయమ న్నారు.
ఇదేవిధంగా ఇతర అభిమాన సంఘాలు కూడా స్పందించి ఆపద సమయంలో బాధ్యతాయుతంగా ప్రవర్తించి తోటి వారికి సాయం అందించడంతో, మానవతను చాటుకోవడంలో ముందుండి స్ఫూర్తిదాయకం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి
నేతృత్వం వహించిన శ్రీకాకుళం జిల్లా జనసేన నాయకులు గేదెల చైతన్య, గురుప్రసాద్, ఉదయ్ కుమార్, వెంకీ పట్నాయక్, సాగ ర్, సంతోష్ అభినందించారు. శ్రీకాకుళం జిల్లా జనసేన నాయకులు గేదెల చైతన్య మాట్లాడుతూ..ఏటా మాదిరిగానే తమ అధినేత పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలను సామాజిక బాధ్యతతో కూడిన కార్యక్రమాలుగా రూపొందించడంలో ఎందరో ప్రేరణగా నిలుస్తు న్నారని, ముఖ్యంగా కరోనా సమయంలో తమతో పాటు, యూరప్ విభాగంకు చెందిన సభ్యులు కూడా భాగం పంచుకోవడం ఆనం దాయకమన్నారు. మరో నాయకులు గురుప్రసాద్ మాట్లాడుతూ తమకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇదే రీతిన తన సేనాని పిలుపు మేరకు ఎలాంటి విపత్తు సమయంలో అయినా, శక్తి మేరకు సాయం అందించేందుకు తామెన్నడూ సిద్ధమే నని వెల్లడించారు. తిత్లీ సమయంలోనూ, లాక్డౌన్ సమయంలోనూ ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలను ఆదుకునేందుకు జన సైనికులు తమతో పాటు కలిసి పనిచేశారని,ఈ విషయమై ప్రాంతాలకతీతంగా రెండు తెలుగు రాష్ట్రాల అభిమానులూ,జనసైనికు లూ స్పందించారని తెలిపారు. అదే స్ఫూర్తితో ఈ ఆక్సిజన్ సిలిండర్ కిట్ల అందజేసేందుకు ముందుకు వచ్చామని అన్నారు. ఈ ప రిణామం తనకెంతో ఆనందంగా ఉందని, తమకు సహకరించిన శ్రీకాకుళం యూత్ ఫోర్స్ అధ్యక్షులకూ,ఇతర సభ్యులకూ కృతజ్ఞత లు చెల్లించారు.