Moviesతమ్ముడు కొడుకు హీరోయిన్‌తో మెగాస్టార్ రొమాన్సా... ఎవ‌రా హీరోయిన్..!

తమ్ముడు కొడుకు హీరోయిన్‌తో మెగాస్టార్ రొమాన్సా… ఎవ‌రా హీరోయిన్..!

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చాక వ‌రుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. సైరా న‌ర‌సింహారెడ్డి సినిమా త‌ర్వాత ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత మెగాస్టార్ కోలీవుడ్ హిట్ మూవీ వేదాళం రీమేక్‌ను చేస్తున్నార‌ట. కోలీవుడ్‌లో త‌ల అజిత్ హీరోగా శివ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కి సూప‌ర్ హిట్ అయ్యింది. ఈ సినిమాకు మెహ‌ర్ ర‌మేష్ డైరెక్ట‌ర్ అని టాక్‌..?

ఈ సినిమా క‌థ‌ను తెలుగు నేటివిటికి అనుగుణంగా మార్పులు, చేర్పులు చేసే ప‌నిలో మెహ‌ర్ బిజీగా ఉన్నాడ‌ని.. అల్లు అర‌వింద్ ఈ సినిమాను నిర్మిస్తాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఫిదా ఫేం సాయి ప‌ల్ల‌విని అడుగుతున్నార‌ట‌. సాయి ప‌ల్ల‌వి ఇప్పుడున్న స్టార్ సీనియ‌ర్ హీరోల ప‌క్క‌న న‌టించేందుకు నో చెపుతోంది.

ఆమె ఎక్కువుగా కుర్ర హీరోల ప‌క్క‌న న‌టించేందుకే ఓకే చెపుతోంది. మ‌రి ఈ టైంలో చిరంజీవి ప‌క్క‌న వ‌చ్చిన ఛాన్స్‌ను ఆమె ఒప్పుకుంటుందా ?  లేదా నో చెపుతుందా ? అన్న‌ది చూడాలి. ఏదేమైనా మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు కుమారుడు వ‌రుణ్ ప‌క్క‌న ఫిదాలో న‌టించి ఫిదా చేసిన ఈ అమ్మ‌డికి ఇప్పుడు ఏకంగా వ‌రుణ్ పెద‌నాన్న ప‌క్క‌న ఛాన్స్ అంటే మామూలు విష‌యం కాదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news