కరోనా మహమ్మారి విషయంలో ఇప్పటికే డ్రాగన్ దేశం చైనాపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చైనాపై ఎన్ని విమర్శలు వస్తున్నా చైనా మాత్రం కరోనా వైరస్ తనది కాదన్నట్టుగానే వ్యవహరిస్తోంది. తాజాగా మరోసారి చైనా కరోనా వైరస్ విషయంలో బుకాయింపుకు దిగుతోంది. కరోనా వైరస్ విషయంలో చైనా పారదర్శకంగానే వ్యవహరించిందని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మంగళవారం మరోసారి సమర్థించుకున్నారు.
కరోనా వైరస్‌పై పోరాటం జరిగినప్పుడు సమర్థవంతమైన పాత్ర పోషించిన వారి కోసం మంగళవారం బీజింగ్‌లో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కరోనా వైరస్ విషయంలో చైనా ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది ప్రజల ప్రాణాలు కాపాడడంలో చైనా కృషి చేసిందని ఆయన నిస్సిగ్గుగా చెప్పుకున్నారు. కరోనా సంక్షోభ సమయంలో మొదట సానుకూల వృద్ధిరేటు పొందిన ప్రధాన ఆర్థిక వ్యవస్థ కూడా చైనాయే అని చెప్పడం గమనార్హం.
చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచం మొత్తం విస్తరించడంతో పాటు లక్షల మంది ప్రజల ప్రాణాలు పోవడానికి కారణమైంది. దీంతో చైనాపై ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల నుంచి విమర్శలు వస్తున్నా చైనా మాత్రం సమర్థించుకునేలా మాట్లడడం శోఛనీయం.