ఆమె మాజీ సీఎం భార్య, హీరోయిన్, లేడీ నిర్మాత ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా ఆమెకు షాక్ ఇచ్చి.. ఏకంగా రు. 3 కోట్లకు కుచ్చు టోపీ పెట్టేశారు. ఆ ఫేమస్ హీరోయిన్, మాజీ సీఎం గారి భార్యకు జరిగిన మోసం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి భార్య రాధికకు ఓ వీడియో షేరింగ్ వెబ్సైట్ రు. 3 కోట్లకు కుచ్చు టోపీ పెట్టింది. ఆమె నిర్మాతగా తీసిన ఓ సినిమా ఆమె అనుమతి లేకుండానే ఆ వెబ్సైట్ తన ఛానెల్లో అప్లోడ్ చేసింది.
ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో నిర్మాత రాధిక కుమారస్వామి ఆ ఛానెల్‌పై చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్నారు. కన్నడలో రాధికా కుమారస్వామి `స్వీటీ నాన్న జోడీ` (2013) అనే సినిమాను నిర్మించారు. రు. 3 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో మంచి హిట్ అయ్యింది. అయితే ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను రాధికా కుమారస్వామి ఇంకా ఎవ్వరికి ఇవ్వలేదు.
అయితే ఈ సినిమా రైట్స్ తీసుకోకుండానే ఓ యూట్యూబ్ ఛానెల్ ఆ సినిమాను అప్లోడ్ చేసింది. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న రాధిక వెంటనే రియాక్ట్ అయ్యింది. తనకు రు. 3 కోట్లు కుచ్చుటోపీ పెట్టిన ఆ ఛానెల్‌పై ఆమె చట్టపరమైన చర్యలకు రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే బెంగళూరులోని సీఈఎన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు.