దేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతుంది. కరోనా రాజకీయ నాయకులను వదలకుండా వెంటాడుతోంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కరోనా భారీన పడుతున్నారు. ఇక తాజాగా పార్లమెంటు సమావేశాల సందర్భంగా జరిపిన కోవిడ్ టెస్టుల్లో పలువురు ఎంపీలకు సైతం కరోనా సోకిన విషయం వెల్లడైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పలువురు ఎమ్మెల్యేలు కోవిడ్ భారీన పడిన సంగతి తెలిసిందే.
ఇక కేంద్ర మంత్రులే కాకుండా ముఖ్యమంత్రులు సైతం కరోనాకు గురవ్వడం తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది.తాజాగా అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా ఆయనకు పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌లో వెల్లడించారు. తనకు ఎలాంటి లక్షణాలు లేకుండా కరోనా వచ్చిందని ఆయన చెప్పారు. ప్రస్తుతం డాక్టర్ల సలహా మేరకు ఆయన హోం క్వారంటైన్‌లో ఉంటున్నారు.