టీడీపీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే.. రెండు పార్వ్శాలు ఖచ్చితంగా కనిపిస్తాయి. ఒకటి.. ఎన్టీఆర్ నడిపిన టీడీపీ.. రెండు చంద్రబాబు నడిపిస్తున్న టీడీపీ. ఎన్టీఆర్ టీడీపీ కేవలం ఆయన డైలాగులు, సినిమాటిక్‌తో నడించిందనే చెప్పాలి. ఇక్కడే మరో విషమం గమనించాలి.. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన పరిస్థితులు వేరు… ఇప్పటి పరిస్థితులు వేరు. ఆయనను ఎవరూ తక్కువ చేయాలని అనుకోకపోయినా.. అనుకున్న హవాను, ఇమేజ్‌ను ఎన్టీఆర్ సొంతం చేసుకుంది కేవలం తన నటన, సినీ గ్లామర్ అని చెప్పాల్సి ఉంటుంది.
కానీ, చంద్రబాబు ఎలాంటి సినీ గ్లామర్ లేకపోయినా.. పెద్దగా ఆకర్షణా రూపం కాకపోయినా.. ఆయన పార్టీ నడిపిస్తున్నారంటే.. కేవలం ఆయన విజన్‌తోనే..! దీనికి నూటికి నూరు పాళ్లు ఓట్లు పడ్డాయి. ఆయనను తప్పు పట్టేవారు.. కూడా ఆయన విజన్‌ను మాత్రం తప్పు పట్టలేరు. సుదీర్ఘమైన వ్యూహం, భవిష్యత్తుపై తీరని దాహం.. ఆయన సొంతం. ఏదో చేయాలి.. ఏదైనా చేయాలి.. అనే తత్వం చంద్రబాబును ముందుకు నడిపించడమే కాదు.. మున్ముందు ఇలాంటి నాయకుడు ఉన్నారని చెప్పుకొనే స్థాయికి తీసుకువెళ్లింది. మూడు సార్లు ఆయన ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు. పొత్తులున్నా.. సొంతగా పోటీ చేసినా.. ఆయన మూడు సార్లు సాధించిన సీఎం రికార్డు ను ఇప్పటి వరకు ఎవరూ అందిపుచ్చుకోలేక పోయారు.
భవిష్యత్తు గురించి చెప్పలేం. సో.. ఇప్పటికైతే.. చంద్రబాబుదే రికార్డు. ఇక, పార్టీలో అనేక కుదుపులు వచ్చినా.. ఎంతో మంది సీనియర్లు దూరమైనా.. ఆయన చింతించలేదు. ఇక నందమూరి కుటుంబాన్ని కూడా ఎప్పుడు ఎక్కడ అవకాశం వచ్చినా.. ఆదరించారు. ఇక, ఉమ్మడి రాష్ట్రం సహా విభజిత రాష్ట్రంలోనూ చంద్రబాబు వేసిన అడుగులు.. తీసుకున్న నిర్ణయాలు తెలుగు నేలపై ఆయన్ను ఓ ప్రత్యేకమైన నేతగా నిలబెట్టాయి. ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా చంద్రబాబు విజన్‌ను తోసిపుచ్చే పరిస్థితి లేదు. ఇదే ఆయనను ఇప్పటికీ.. విజన్ ఉన్ననాయకుడిగా నిలబెట్టిందనడంలో సందేహం లేదు.