Moviesఆ న‌టుడి కూతురు కిల్లింగ్ లుక్స్‌తో చంపేస్తోందిగా... ఆ హీరో ఫ్యాన్స్...

ఆ న‌టుడి కూతురు కిల్లింగ్ లుక్స్‌తో చంపేస్తోందిగా… ఆ హీరో ఫ్యాన్స్ ప‌డిపోవాల్సిందే..!

బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు చుంకీ పాండే కుమార్తె అన‌న్య పాండే తాజా ఫొటో సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతోంది. ఆమె కిల్లింగ్ లుక్స్‌తోనే కుర్ర‌కారును చంపేస్తోంది. క‌ర‌ణ్ జోహార్ అన‌న్య కెరీర్‌ను మొత్తం చూస్తున్నాడు. బాలీవుడ్ న‌ట‌వార‌సురాళ్ల కెరీర్‌ను క‌ర‌ణ్ ద‌గ్గరుండీ మ‌రీ చూస్తోన్న సంగ‌తి తెలిసిందే. కరణ్ జోహార్ గత ఏడాది ఈ అమ్మడిని బాలీవుడ్ కి పరిచయం చేశాడు.

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 లో మరో హీరోయిన్‌తో క‌లిసి అన‌న్య స్క్రీన్ షేర్ చేసుకుని కాలేజ్ స్టూడెంట్‌గా ఆక‌ట్టుకుంది. తొలి సినిమాలో ఆమె న‌ట‌న‌కు మంచి మార్కులు ప‌డ‌డంతో ఆ త‌ర్వాత క‌ర‌ణ్ అన‌న్య‌కు వ‌రుస‌గా క్రేజీ ఆఫ‌ర్లు ఇస్తున్నాడు. ప్ర‌స్తుతం ఆమె తెలుగులో విజ‌య్ దేవ‌ర‌కొండ ప‌క్క‌న ఫైట‌ర్ సినిమా చేస్తోంది. ఈ ఫొటోల్లో ఆమె విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌ధ్య ఉన్న కెమిస్ట్రీ సూప‌ర్బ్‌గా క‌నిపిస్తోంది. ఆమె లుక్స్‌కే కుర్ర కారు ఫిదా అయ్యేలా ఆమె క‌వ్విస్తోంది.

ఇక అన‌న్య న‌టించిన ఖలీ పీలీ ట్రైలర్ యూట్యూబ్ లో రిలీజై డిస్ లైక్స్ పాలవ్వడం చర్చకొస్తోంది. అయితే సుశాంత్ విష‌యంలో క‌ర‌ణ్ జోహార్‌పై ఉన్న వ్యతిరేక‌త కాస్తా ఇప్పుడు ఆయ‌న నిర్మిస్తోన్న సినిమాలు, ఎంక‌రేజ్ చేస్తోన్న వారి సినిమాల‌పై ప‌డుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇక అన‌న్య తాజాగా  సోషల్ మీడియాల్లో షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి. ఆమె త‌న స్టన్నింగ్ లుక్ తో రౌడీ హీరో ఫ్యాన్స్‌కు మాంచి కిక్ ఇస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news