బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ జూన్ 14న ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. సుశాంత్ మృతి చెందినప్పటి నుంచి ఈ కేసులో రోజుకో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. ఇక సీబీఐ సైతం ఈ కేసును ఎంతో ప్రతిష్టాత్మకంగా విచారిస్తోంది. మొత్తం మూడు జాతీయ దర్యాప్తు సంస్థలు సుశాంత్ కేసు విచారిస్తున్నాయి. ఇక సుశాంత్ మరణం చుట్టూ ఎన్నో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి.
సీబీఐకు వెళ్లడంతో సుశాంత్ మరణం గురించి అనేక సంచనల విషయాలు వస్తాయని అతడి అభిమానులు ఎంతో ఆసక్తితో వెయిట్ చేశారు. ముందు నుంచి సుశాంత్‌ది ఆత్మహత్య కంటే హత్యే అన్న అనుమానాలు బలంగా వినిపించాయి. ఇప్పుడు సీబీఐ ఈ కేసును టేకాఫ్ చేయడంతో సుశాంత్ హత్య కోణం గురించి ఏదైనా సమాచారం ఉంటుందని భావించిన అతడి అభిమానులకు ఊహించని విధంగా రిపోర్టులు వస్తున్నాయి.
సీబీఐ తాజాగా వెల్లడించిన సమాచారం ప్రకారం సుశాంత్‌ది హత్య అని చెప్పేందుకు ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లేవని.. అతడి పోస్టు మార్టం రిపోర్టు కూడా ఆత్మహత్యగానే వచ్చిందని.. తమ విచారణతో పాటు పోస్టు మార్టం రిపోర్టుల్లో సుశాంత్‌ది హత్య అని చెప్పేందుకు ఇంకా సరైన ఆధారాలు లభ్యం కాలేదని సీబీఐ చెప్పింది. దీంతో మరోసారి సుశాంత్ కేసులో ఇది ఊహించని మలుపుగా మారింది.