Moviesఆ అవుట్ డేటెడ్ హీరోతో స్వాతి రీ ఎంట్రీ..!

ఆ అవుట్ డేటెడ్ హీరోతో స్వాతి రీ ఎంట్రీ..!

క‌ల‌ర్‌ఫుల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న అందాల చిన్న‌ది స్వాతి కెరీర్ స్టార్టింగ్‌లో బుల్లితెర‌తో పాటు వెండితెర‌పై మంచి అవ‌కాశాలు సొంతం చేసుకోవ‌డంతో పాటు ఎంతోమంది కుర్రకారు గుండెల్లో గిలిగింత‌లు పెట్టింది. ఆమె చిలిపి చేష్ట‌ల‌తో క‌ల‌ర్స్ ప్రోగ్రామ్ సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యింది. ఆ త‌ర్వాత ఆమె వెండితెర మీద కూడా స‌క్సెస్‌లు చూసింది. చాలా గ్యాప్ త‌ర్వాత ఆమె మ‌ళ్లీ టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను క‌నువిందు చేసేందుకు రెడీ అవుతోంది.

తెలుగులో ఆమె చివ‌రిగా లండ‌న్ బాబులు సినిమా చేసింది. ఈ సినిమా త‌ర్వాత ఆమె తిరిగి న‌టించ‌లేదు. ఇక ఇప్పుడు మ‌ళ్లీ స్వాతి మ‌న‌స్సు టాలీవుడ్‌పై మ‌ళ్లింది. ప్ర‌స్తుతం థియేట‌ర్లు తెర‌చుకునే స్కోప్ లేక‌పోవడంతో ఓటీటీ ప్లాట్ ఫాంల‌కు డిమాండ్ పెరిగింది. దీంతో సీనియ‌ర్ హీరోయిన్లు, అవుట్ డేటెడ్ హీరోలు, హీరోయిన్ల‌కు ఇవి మంచి వ‌రంగా మారాయి. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు స్వాతి సైతం ఓ ఓటీటీ మూవీతో ఎంట్రీ ఇస్తోంద‌ట‌.

ఓటీటీ ప్లాట్ ఫాం స‌రైన వేదిక‌గా స్వాతి భావిస్తున్నార‌ని స‌మాచారం. ఈ సినిమాలో స్వాతి ప‌క్క‌న కూడా ఓ అవుట్‌డేటెడ్ హీరోయే నటించ‌నున్నాడ‌ట‌. ఇప్ప‌టికే స‌ద‌రు హీరో కూడా సినిమాలు లేక చిన్న చిన్న షోలు చేసుకుంటున్నాడు. మ‌రి ఈ అవుట్ డేటెడ్ హీరో, హీరోయిన్లు క‌లిసి న‌టించే ఆ వెబ్ సీరిస్ అయినా వీళ్ల‌కు పున‌ర్వైభ‌వం తెస్తుందేమో ?  చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news