మనదేశంలో కరోనా ఎంతో మంది సెలబ్రిటీలను వదలకుండా వెంటాడుతోంది. సినిమా, రాజకీయ రంగాలకు చెందిన పలువురిని కూడా కరోనా వెంటాడుతూనే ఉంది. ఈ క్రమంలోనే కరోనా బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్‌కు కూడా సోకింది. తనకు కోవిడ్ – 19 సోకినట్టుగా అర్జున్ కపూర్ స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అయితే తనకు కరోనా లక్షణాలు లేకుండానే పాజిటివ్ వచ్చిందని అర్జున్ కపూర్ వెల్లడించారు.
ఇక వైద్యుల సూచనల మేరకు తాను కొద్ది రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండనున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఇన్‌స్టాలో నోట్ షేర్ చేసిన అర్జున్ నాకు కరోనా సోకిన విషయం మీతో పంచుకోవడం నా కర్తవ్యం.. ప్రస్తుతానికి తాను బాగానే ఉన్నా.. లక్షణాలు కనిపించడం లేదు.. వైద్యుల సూచనల మేరకు హోం ఐసోలేషన్‌లో ఉంటున్నానని పోస్ట్ చేశాడు.
ఇక నా ఆరోగ్యానికి సంబంధించి ప్రతి విషయం మీతో పంచుకుంటాను.. ఇలాంటి కఠిన సమయాల్లో.. మానవత్వమే వైరస్‌పై విజయం సాధిస్తుందని నమ్ముతున్నానంటూ అర్జున్ చెప్పాడు.