పెళ్లయిన ఇర‌వై రోజుల‌కే భ‌ర్త‌పై కేసు పెట్టిన హాట్ హీరోయిన్‌

బాలీవుడ్ హాటీ బ్యూటీ పూన‌మ్ పాండే పెళ్ల‌యిన 20 రోజుల‌కే త‌న భ‌ర్త వేధిస్తున్నాడంటూ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. పూన‌మ్ ఈ నెల 1వ తేదీన సామ్‌ను వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత పూన‌మ్ త‌న భ‌ర్త‌తో ఉన్న ఫొటోల‌ను కూడా షేర్ చేసి షాక్ ఇచ్చింది. తాజాగా ఆమె భ‌ర్త వేధిస్తున్నాడంటూ చేసిన ఫిర్యాదు మేర‌కు గోవా పోలీసులు సాం బాంబేను అరెస్టు చేశారు.

 

త‌న‌ను భ‌ర్త వేధిస్తుండ‌డంతో పాటు తీవ్ర ప‌రిణామాలు ఎదుర‌వుతాయ‌ని కూడా హెచ్చ‌రించిన‌ట్టు పూనం పాండే సోమ‌వారం రాత్రి ఫిర్యాదు చేయ‌గా.. గోవా పోలీసులు అరెస్టు చేశారు. కేసు న‌మోదు చేసిన పోలీసులు పూనంకు వైద్య ప‌రీక్ష‌లు చేస్తున్నారు. ఇక పూనం సినిమాల కంటే ఎప్పుడూ హాట్ హాట్ ఫొటో షూట్లు, కాంట్ర‌వ‌ర్సీ వ్యాఖ్య‌ల‌తోనే ఎక్కువుగా వార్త‌ల్లో నిలుస్తుంటార‌న్న సంగ‌తి తెలిసిందే.

 

పూనమ్‌ 2013లో నాషాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. చేసింది. త‌క్కువ సినిమాల‌తోనే ఎక్కువ పాపుల‌ర్ అయిన పూనం ఈ నెల 10న త‌న పెళ్లి ఫొటోలు సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంతో పాటు మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ బాంబే అంటూ ఆ ఫోటోలకు క్యాప్షన్‌ ఇచ్చింది. ఇంత‌లోనే భ‌ర్త‌పై ఫిర్యాదు చేసి వార్త‌ల్లోకెక్కింది.

Leave a comment