బాల‌య్య – బోయ‌పాటి సినిమాకు అమోజాన్ బంప‌ర్ ఆఫ‌ర్‌… ఎన్ని కోట్లో తెలుసా..!

నంద‌మూరి బాల‌కృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తోన్న సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ అప్పుడే మొద‌లైంది. ఈ సినిమా ఇప్పటి వ‌ర‌కు కేవ‌లం 15 రోజులు మాత్ర‌మే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల కోసం అమోజాన్ ప్రైమ్ రు. 9 కోట్లు ఆఫ‌ర్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఈ డీల్ ఓకే అయితే క‌నుక బాల‌య్య సినిమా కెరీర్‌లోనే ఇది అతి పెద్ద డిజిట‌ల్ డీల్ అవుతుంది.

 

బాలయ్య-బోయపాటి కాంబోకు మార్కెట్లో మంచి క్రేజ్ ఉంది. ఇంతకుముందు వీరిద్ద‌రి కాంబోలో వ‌చ్చిన సింహా, లెజెండ్ రెండు సినిమాలు హిట్ అయ్యాయి. దీంతో ఈ హ్యాట్రిక్ కాంబో సినిమా ఇప్పుడు మార్కెట్లో మంచి హాట్ కేక్‌గా మారింది. ప్ర‌స్తుతం క‌రోనా నేప‌థ్యంలో పెద్ద హీరోల సినిమాలు సెట్స్ మీద‌కు వెళ్ల‌డం లేదు.

 

అయితే ఇప్పుడిప్పుడే కొంద‌రు హీరోల సినిమాలు సెట్స్ మీద‌కు వెళుతున్నాయి. మ‌రి ఈ నేప‌థ్యంలో బాల‌య్య కూడా మ‌న‌సు మార్చుకునే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ఈ సినిమాను మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

Leave a comment