బిగ్‌బాస్ ఎంత కాంట్రవర్సీ ఉన్నా ఓ రేంజ్‌లో ప్రేక్షాకాదరణ పొందే బుల్లితెర రియాల్టీ పాపులర్ షో. ఇక తొలి మూడు సీజన్లు సూపర్ హిట్ అవ్వడంతో బిగ్‌బాస్ నిర్వాహకులు గ్రాండ్‌గా ఖర్చు పెట్టి మరీ నాలుగో సీజన్ రన్ చేస్తున్నారు. ఇక లాక్‌డౌన్ కారణంగా జనాలు కూడా ఎంటర్టైన్‌మెంట్ కోసం మొఖం వాచిపోయి ఉన్నారు. ఈ క్రమంలోనే బిగ్‌బాస్ 4కు ప్రజలు బ్రహ్మరథం పడతారని భావించారు. ఈ అంచనాలకు తగ్గట్టుగానే బిగ్‌బాస్ తొలి ఎపిసోడ్ ఏకంగా 18.5 టీఆర్పీతో దూసుకుపోయింది. ఇది నిజంగానే ఓ రికార్డు అనుకోవాలి.
ఈ ప్రారంభ ఎపిసోడ్‌కు నిర్వాహకులు కనీసం 20 టీఆర్పీ వస్తుందని ఊహించారు. అయితే అంత రాలేదు. ఆ ఒక్క ఎపిసోడ్‌తోనే మురిపించిన బిగ్‌బాస్ ఆ వెంటనే టపాలున కింద పడింది. మళ్లీ ఎప్పటిలాగానే కార్తీక దీపం సీరియల్ టాప్ ప్లేసులోకి వెళ్లిపోయింది. ఇక ఇంటింటి గృహలక్ష్మి రెండవ స్థానాన్ని ఆక్రమించింది. ఆ తర్వాతి స్థానానికి బిగ్ బాస్ పరిమితమైంది. ఇక ఈ మూడు కార్యక్రమాలు స్టార్ మావే కావడం విశేషం.
అంటే ప్రారంభ రోజు మాత్రమే వంటలక్కకు షాక్ ఇచ్చిన బిగ్‌బాస్ మళ్లీ మరుసటి రోజు నుంచే చతికిల పడింది. ఇక వచ్చే ఆదివారం నుంచి ఐపీఎల్ కూడా ప్రారంభం కావడంతో ఆ ఎఫెక్ట్ బిగ్‌బాస్‌పై మరింతగా పడుతుందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే బిగ్‌బాస్ షోకు మరో పెద్ద దెబ్బే అనుకోవాలి.