ఈ సారి బిగ్‌బాస్ హౌస్‌లో అమ్మాయిలు ఎక్కువ మంది ఉండడంతో అబ్బాయిలకు ఇబ్బంది తప్పేలా లేదు. హౌస్‌లోకి వెళుతోన్న 15 మంది అమ్మాయిలే ఎక్కువ మంది ఉన్నారు. వీరిలో కూడా ఒకరిద్దరు హీరోయిన్లతో పాటు హాట్ ఇమేజ్ ఉన్నవాల్లు.. బుల్లితెరపై పాపులర్ అయిన సీరియల్ నటీమణులు కూడా ఉన్నారు. వీళ్లంతా బయటే పెద్ద ముదుర్లు అన్న ముద్ర పడిన వారు ఉన్నారు. మరి ఇలాంటి లేడీ కంటెస్టెంట్లతో పురుష కంటెస్టెంట్లు ఎలా పోటీ పడతారు ? అన్నదే ఆసక్తిగా ఉంది.
ఇక మూడో సీజన్‌తో పోలిస్తే ఈ సారి మరింత ఇంట్రస్టింగ్‌గా ఉండేలా టాస్క్‌లను ప్లాన్ చేశారట షో నిర్వాహకులు. అబ్బాయిలు వర్సెస్ అమ్మాయిల మధ్య వచ్చే టాస్క్‌లలో డ్రామా కూడా ఉంటుందని తెలుస్తోంది. అబ్బాయిలకు ఇత్తడి ఇత్తడి అవుతుందని.. ఈ దేశ ముదుర్లను వీళ్లు ఎలా తట్టుకుంటార్రా బాబు అని సోషల్ మీడియా డిస్కర్షన్లు స్టార్ట్ అయ్యాయి.
ఈ సారి గతంతో పోలిస్తే హాట్ ఇమేజ్, గ్లామర్ షోకు స్కోప్ ఎక్కువ ఉన్నట్టే కనిపిస్తోంది. ఇక 15 మంది కంటెస్టెంట్లతో మొత్తం 105 రోజుల, 106 ఎపిసోడ్లుగా షో నడుస్తుందని తెలుస్తోంది. ఇక మూడో సీజన్ హోస్ట్ చేసిన కింగ్ నాగార్జున నాలుగో సీజన్‌ను మరింత రక్తికట్టించేలా ప్రిపేర్ అవుతున్నాడట. ఇక కరోనా నేపథ్యంలో టాస్క్‌ల నిర్వహణకు, హోస్టింగ్ చేసే నాగార్జున కోసం బిగ్‌బాస్ టీం ప్రత్యేక జాగ్రత్త లు తీసుకుంటుంది. ముఖ్యంగా నాగ్ కోసం ప్రత్యేక రూమ్స్ ను అండ్ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తోందట.