బిగ్బాస్ 4వ సీజన్ తెలుగు వెర్షన్ ప్రారంభం కావడానికి మరి కొద్ది గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ టైంలో బిగ్బాస్కు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే యూట్యూబర్ అలేఖ్య హారికకు కరోనా వచ్చింది. ఆమె షో నుంచి తప్పుకుంది. ఇదిలా ఉంటే మరో ఇద్దరు కంటెస్టెంట్లు సైతం బిగ్బాస్ నిర్వాహకులకు షాక్ ఇచ్చారని తెలుస్తోంది. తనుజ పుత్తుస్వామి అనే కంటెస్టెంట్ కూడా చివరి నిమిషంలో షోకు హ్యండ్ ఇచ్చిందట.
ఆమె ముద్దమందారం సీరియల్లో నటించింది. ఆమెకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే ఆమెను బిగ్బాస్ నిర్వాహకులు సెలక్ట్ చేసినా చివరి నిమిషంలో ఆమె షో నుంచి తప్పుకుంది. ఇక కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ దంపతులు కూడా చివర్లో షో నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఏం చేయాలో తెలియని పక్షంలో బిగ్బాస్ యాజమాన్యం చివర్లో వెయిటింగ్ లిస్టులో ఉన్న మరి కొందరు కంటెస్టెంట్లను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.
ఏదేమైనా బిగ్బాస్ సీజన్ 4 నిర్వాహకులు షో ప్రారంభం నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బిగ్బాస్ 4 ప్రారంభం కాకుండానే ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంది. దీంతో షో విషయంలో ప్రేక్షకులు సైతం కాస్త కన్ఫ్యూజన్లోనే ఉన్నారు. ఈ షో షూటింగ్ సెప్టెంబర్ 5న ప్రారంభం కానుండగా… షో మొదటి ఎపిసోడ్ సెప్టెంబర్ 6న ప్రారంభం కానుంది.