Moviesదిశ ఎన్‌కౌంట‌ర్ పోస్ట‌ర్‌తోనే సంచ‌ల‌నం రేపిన వ‌ర్మ‌

దిశ ఎన్‌కౌంట‌ర్ పోస్ట‌ర్‌తోనే సంచ‌ల‌నం రేపిన వ‌ర్మ‌

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ‌కు కాదేది సినిమాకు అన‌ర్హం అన్న‌ట్టుగా ఉంది. స‌మాజంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌లు, రాజ‌కీయాలు, క్రైం అన్ని కూడా రాంగోపాల్ వ‌ర్మ‌కు సినిమా క‌థ‌లు అయిపోయాయి. ఈ క్ర‌మంలోనే గ‌తేడాది హైద‌రాబాద్‌లో హ‌త్య‌కు గురైన దిశ‌, ఆ త‌ర్వాత ఆమెను కిరాత‌కంగా చంపేసిన కీచ‌కుల‌ను ఎన్‌కౌంట‌ర్ చేసిన అంశం నేప‌థ్యంలో సినిమా తెర‌కెక్కించేందుకు వ‌ర్మ రెడీ అవుతున్నారు. గ‌తంలోనే దిశ నిందితుల ఎన్‌కౌంట‌ర్ నేప‌థ్యంలో సినిమా తీస్తాన‌ని ప్ర‌క‌టించిన‌ట్టుగానే ఇప్పుడు ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.

ఇందులో ఓ యువ‌తి స్కూటీతో పాటు, నిందితుడు పారిపోతూ ఉండ‌టం, వారిని ఎన్‌కౌంట‌ర్‌ చేసేందుకు ఓ తుపాకీ గురి పెట్టి ఉండ‌టం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఇక దిశ‌ను హ‌త్య చేసేముందు ఓ లారీ వాడార‌ని కూడా తెలిసిందే. పోస్ట‌ర్‌లో వ‌ర్మ ఓ లారీ కూడా ఉంచాడు. ఈ సినిమాను అనురాగ్ కాసర్ల నిర్మిస్తున్నారు. ఇక దిశ హ‌త్య విష‌యానికి వ‌స్తే గ‌తేడాది న‌వంబ‌ర్ 26న న‌లుగురు నిందితులు  ఓ యువ‌తిని ల‌క్ష్యంగా చేసుకుని అత్యాచారం చేసి ఆమెను చంపేసి ఆ బాడీకి నిప్పుపెట్టిన సంగ‌తి తెలిసిందే.

ఇక ఆ త‌ర్వాత వ‌ర్మ ఈ న‌లుగురు నిందితుల్లో ఒక‌రు అయిన చెన్న‌కేశ‌వులు భార్య‌ను క‌లిశారు. అదేవిధంగా శంషాబాద్ పోలీసుల‌ను కూడా క‌లిసి సినిమా కంప్లీట్ చేశారు. ఇక ఈ సినిమా ట్రైల‌ర్ సెప్టెంబ‌ర్ 26న, న‌వంబ‌ర్ 26న సినిమా రిలీజ్ కానున్నాయి. ఏదేమైనా ఫ‌స్ట్ లుక్‌పోస్ట‌ర్‌తోనే వ‌ర్మ క‌థేంటో చెప్పి పెద్ద సంచ‌ల‌నం రేపాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news