స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో వస్తున్న క్రేజీ మూవీ పుష్ప. పాన్ ఇండియా రేంజ్లో ఐదు భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ హీరోయిన్. ఇక రంగస్థలం సినిమాలో చిట్టిబాబు పాత్రను మించేలా పుష్ప పాత్ర ఉంటుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. శేషాచలం అడవుల్లోని గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా కథ ఉంటుందని తెలుస్తోంది. పుష్ప విషయంలో అంతా క్లారిటీగానే ఉన్నా విలన్ ఎవరు అన్నది మాత్రం తెలియడం లేదు.
విజయ్ సేతుపతిని అడిగితే ఆయన కాదన్నారని.. బిజీగా ఉండడంతో డేట్లు ఇవ్వలేదని అంటున్నారు. మరో టాక్ ప్రకారం రెమ్యునరేషన్ కూడా తేడా వచ్చిందట. ఇక బాలీవుడ్ నుంచి ఎవరిని అయినా విలన్‌గా తీసుకోవాలని ట్రై చేస్తున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్టు కావడంతో ఆ రేంజ్ విలన్ ఉంటేనే అన్ని భాషలకు విలన్ కనెక్ట్ కావడంతో పాటు సినిమాకు మంచి బజ్ ఉంటుందని సుకుమార్ ఉన్నాడు. అయితే బన్నీకి ధీటైన విలన్ కోసం మాత్రం ఇంకా అన్వేషణ కొనసాగుతూనే ఉందట.
ఇక త్వరలోనే షూటింగ్ ప్రారంభించి 2020 ఎండింగ్ కల్లా సగం పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ముందుగా కేరళ అడువల్లో షూటింగ్ చేయాలనుకున్నా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సాధ్యం కాదని… చివరకు మహబూబ్‌నగర్ అడవుల్లో రియల్ సెట్ వేసి షూటింగ్ చేస్తున్నారు. మరి పుష్పలో విలన్‌పై సుకుమార్ ఎప్పుడు క్లారిటీ ఇస్తాడో ? చూడాలి.