Gossipsబాల‌య్య‌కు - బోయ‌పాటి బీబీ 3, ఆ ముదురు ముద్దుగుమ్మే ఫిక్సా....!

బాల‌య్య‌కు – బోయ‌పాటి బీబీ 3, ఆ ముదురు ముద్దుగుమ్మే ఫిక్సా….!

నంద‌మూరి బాల‌కృష్ణ – బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న బీబీ 3 సినిమా షూటింగ్ త్వ‌ర‌లోనే షురూ కానుంది. ఇప్ప‌టికే ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్ కూడా రిలీజ్ అయ్యింది. ఇది యూట్యూబ్‌లో దుమ్ము రేపుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ల విష‌యంలో బోయ‌పాటి ముందు నుంచి త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లే ప‌డుతున్నారు. లేటెస్ట్ అప్‌డేట్ ప్ర‌కారం రెండు పాత్ర‌లు చేస్తోన్న బాల‌య్య ప‌క్క‌న సీనియ‌ర్ బాల‌య్య‌కు జోడీగా నిన్న‌టి త‌రం హీరోయిన్ అయిన మీనాను ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తోంది. గ‌తంలో వీరిద్ద‌రు కలిసి బొబ్బిలి సింహం సినిమాలో కూడా న‌టించారు.

Sriya Saran On Item Songs And New Chances In Telugu

ఇక రెండో బాల‌య్య ప‌క్క‌న ముందుగా కొత్త హీరోయిన్‌ను తీసుకోవాల‌ని అనుకున్నారు. ఆ త‌ర్వాత అంజ‌లి పేరు వినిపించింది. అయితే ఇప్పుడు బాల‌య్య‌కు క‌లిసొచ్చిన శ్రీయ పేరును ఫైన‌లైజ్ చేసిన‌ట్టు టాక్‌..? శ‌్రీయ బాలీవుడ్‌లో ఒక‌టి రెండు సినిమాలు చేస్తోంది. ఇక ఇప్పుడు బోయ‌పాటి సినిమాలోనూ ఆమెనే హీరోయిన్ అంటున్నారు. బాల‌య్య‌తో శ్రీయ చెన్న‌కేశ‌వ‌రెడ్డి – శాత‌క‌ర్ణి – పైసా వ‌సూల్ సినిమాల్లో న‌టించింది.

Shriya Saran, husband ignore netizen's objectification quip

ఇక ఇప్పుడు ఈ జోడీ మ‌రోసారి తెర‌మీద క‌నువిందు చేయ‌నుంది. త్వ‌ర‌లోనే ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమా షూటింగ్ ఫినిష్ అయిన వెంట‌నే బాల‌య్య పూరి జ‌గ‌న్నాథ్‌తో మ‌రో సినిమా చేస్తాడ‌ని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news