అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై గతంలోనే లైంగీక ఆరోపణలు ఎన్నోసార్లు వచ్చాయి. ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న టైంలో మరోసారి ఆయనపై వచ్చిన లైంగీక ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ట్రంప్ 1997లో తనను లైంగీకంగా వేధించారంటూ ఓ మాజీ మోడల్ తీవ్ర ఆరోపణలు చేశారు.
రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా తిరిగి బరిలో ఉన్న ట్రంప్ న్యూయార్క్‌లో యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ జరుగుతుండగా ట్రంప్ తన వీఐపీ సూట్‌లో తనను లైంగీకంగా వేధించినట్టు మాజీ మోడల్ అమీ డోరిస్ చెప్పారు. ట్రంప్ నన్ను బలవంతంగా ముద్దు పెట్టుకోవాలని చూడడంతో పాటు తన నాలుకతో నా గొంతకు కిందకు కదిలించే ప్రయత్నం చేశానని ఆమె చెప్పింది. తాను ట్రంప్ నుంచి వదిలించుకోవాలని చూస్తే.. ట్రంప్ నన్ను మరింత గట్టిగా పట్టుకున్నాడని డోరీస్ ఆరోపించింది.
నన్ను గట్టిగా పట్టుకుని తన చేతులతో నా శరీరంపై ఎక్కడెక్కడో ముట్టుకున్నాడని.. నన్ను గట్టిగా పట్టుకోవడంతో అతడి నుంచి విడిపించుకునేందుకు తాను చాలా ఇబ్బంది పడ్డానని ఆమె తన తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఈ ఆరోపణలపై స్పందించిన ట్రంప్ న్యాయవాదులు ఇవి రాజకీయ దురుద్దేశంతో చేసినవే అని కొట్టిపడేశారు.