MoviesR R R ఫ్యాన్స్‌కు పండ‌గే.. తార‌క్ లుక్‌పై క్లారిటీ..!

R R R ఫ్యాన్స్‌కు పండ‌గే.. తార‌క్ లుక్‌పై క్లారిటీ..!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఇప్ప‌టికే అల్లూరి సీతారామ‌రాజు లుక్‌లో రామ్‌చ‌ర‌ణ్ అద‌ర‌గొట్టేశాడు. ఇక కొమ‌రం భీంగా తార‌క్ లుక్ ఎప్పుడు రివీల్ అవుతుందా ? అని తార‌క్ అభిమానుల‌తో పాటు ఆర్ ఆర్ ఆర్ అభిమానులు అంద‌రూ ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తున్నారు. బాహుబ‌లి 1, 2 సినిమాల త‌ర్వాత రాజ‌మౌళి డైరెక్ట్ చేస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమాపై టాలీవుడ్‌లోనే కాకుండా యావ‌త్ దేశ‌వ్యాప్తంగా అన్ని భాష‌ల్లోనూ సినీ ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలు ఉన్నాయి.

 

ఇక తార‌క్ కొమ‌రం భీం లుక్ తార‌క్ బ‌ర్త్ డే కానుక‌గా వ‌స్తుంద‌నుకున్నా రాలేదు. ఇక అక్టోబ‌ర్ తొలి వారంలో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్‌ను తిరిగి ప్రారంభించేందుకు రాజ‌మౌళి ప్లాన్ చేస్తున్నాడు. షూటింగ్ ప్రారంభ‌మైన వెంట‌నే రెండు వారాల త‌ర్వాత అంటే అక్టోబ‌ర్ మూడో వారంలో తార‌క్ కొమ‌రం భీం లుక్ రిలీజ్ అవుతుంద‌ని తెలుస్తోంది. తార‌క్ అభిమానుల నుంచి ఇప్ప‌టికే ఒత్తిడి ఉండ‌డంతో రాజ‌మౌళి షూటింగ్ ప్రారంభ‌మైన వెంట‌నే ఈ లుక్ కోస‌మే రెండు వారాలు షూట్ చేయ‌నున్నాడ‌ని స‌మాచారం.

 

ఈ సినిమాలో హీరోయిన్లుగా చ‌ర‌ణ్ ప‌క్క‌న బాలీవుడ్ బ్యూటీ ఆలియాభ‌ట్‌, చ‌ర‌ణ్ ప‌క్క‌న ఒలివియా మోరీస్ న‌టిస్తున్నారు. ఇక వ‌చ్చే యేడాది ఈ సినిమా వ‌స్తుందా ?  లేదా 2022 సంక్రాంతికి వ‌స్తుందా ? అన్న‌ది పెద్ద స‌స్పెన్స్‌గా ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news