ఓ వైపు కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా ప్రబలుతుంటే మరోవైపు యువత మాత్రం ఏ మాత్రం భయం లేకుండా ఇష్టమొచ్చినట్టు మత్తులో మునిగి తేలుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక దేశంలో అన్‌లాక్ ప్రారంభమైనప్పటి నుంచే డ్రగ్ మాఫియ రెచ్చిపోతోంది. యువత సైతం ఈ డ్రగ్ మాఫియా ఉచ్చులో చిక్కుకుని మత్తులో మునిగి తేలుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌లోని టీ నగర్ ప్రాంతంలో లాక్‌డౌన్ వేళ కూడా యువత మాదక ద్రవ్యాలు తీసుకుంటూ మత్తులో పార్టీ చేసుకుంటున్నారు.
పోలీసుల దాడిలో వీరు అడ్డంగా బుక్ అయ్యారు. ఇందులో 20 మంది బాలికలు 10 మంది బాలురు ఉన్నారు. జరిజోహ్రీ హోటల్ లోని హుక్కా లాంజ్ లో కొంత మంది మైనర్లు పార్టీ నిర్వహిస్తున్నారనే సమాచారం అందుకుని దాడి చేసిన పోలీసులు 20 మంది బాలికలు, 10 మంది బాలురను పట్టుకున్నారు. అప్పటికే వీరికి మత్తు ఎక్కువ అవ్వడంతో వీరంతా తూలిపోతున్నారు. ఇక ఆ సెంటర్ నిర్వాహకులే వారికి డ్రగ్స్ అందించినట్టు పోలీసుల విచారణలో తేలింది. వీరందరిని పోలీసులు అదుపులోకి స్పెషల్ జువెనైల్ పోలీసులకు అప్పగించారు.