అంబటి రాంబాబు…ఎలాంటి విషయన్నైనా అనర్గళంగా మాట్లాడుతూ, ప్రత్యర్ధి పార్టీలపై సెటైర్లు వేసే నేత. మేటర్ వీక్‌గా ఉన్నా సరే తన మాటలతో హైలైట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా చంద్రబాబుపై పనికిమాలిన సెటైర్లు వేయడంలో ముందుంటారు. ఈ విధంగా రాజకీయంగా మాటల గారడీ చేసే అంబటికి ఊహించని షాక్ ఒకటి తగిలింది. అంబటి రాంబాబు అక్రమ మైనింగ్ చేస్తున్నారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అంబటి ఎమ్మెల్యేగా ఉన్న సత్తెనపల్లి నియోజకవర్గంలోని రాజుపాలెం మండలం కోట నెలమపురి, కొండమోడు గ్రామాల్లో అక్రమ మైనింగ్ జరిగిందని పేర్కొంటూ హైకోర్టు న్యాయవాది నాగరఘు పిటిషన్ దాఖలు చేశారు.
రాజుపాలెం వైసీపీ కార్యకర్తల తరఫున ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడం గమనార్హం. వైట్ లైమ్ స్టోన్, మొజాయిక్ చిప్స్ అక్రమ మైనింగ్ చేస్తున్నారని.. దీంతో రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లుతోందని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. ఈ వ్యవహారంపై స్పందించిన కోర్టు అక్రమ మైనింగ్‌పై వెంటనే నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాదికి ఆదేశించింది. సొంత పార్టీ కార్యకర్తలే పిటిషన్ వేయడంతో అంబటి ఫ్యూజులు ఎగిరిపోయాయని టీడీపీ కార్యకర్తలు ఎద్దేవా చేస్తున్నారు. అంబటి సత్తెనపల్లిని దోచుకుంటున్నారని, అక్రమ మైనింగ్‌పై అంబటి తక్షణమే ప్రజలకు సమాధానం చెప్పాలని, ఆయనపై సిబిఐ విచారణ చేయించాలని తమ్ముళ్ళు డిమాండ్ చేస్తున్నారు.
అయితే ఈ అక్రమ మైనింగ్ వ్యవహారం తెరపైకి వచ్చిన దగ్గర నుంచి అంబటి పూర్తిగా సైలెంట్ అయిపోయి ఉన్నారు. అసలు మీడియా ముందుకొచ్చి ఓ హడావిడి చేసే అంబటి…ఇప్పుడు మీడియా ముందుకొచ్చి కనీసం దీనిపై వివరణ ఇచ్చే కార్యరకమ కూడా చేయట్లేదు. ఒకవేళ వేరే విషయంపైన ఏమన్నా మాట్లాడాలని వచ్చినా కూడా అంబటిని మైనింగ్ వ్యవహారం మాత్రం వదిలేలా కనిపించడం లేదు. ఇన్నాళ్ళు నీతులు చెబుతున్న అంబటి సడన్‌గా అక్రమ మైనింగ్ వ్యవహారంలో చిక్కుకుని విలవిలాడుతున్నట్లు కనిపిస్తున్నారు. మొత్తానికైతే మైనింగ్ విషయంతో అంబటిని మడతపెట్టేసినట్లున్నారు