బ్రేకింగ్‌: బీజేపీ నేత దారుణ హ‌త్య‌

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రోజు రోజుకు నేరాల‌కు అడ్డాగా మారిపోతోంది. తాజాగా రాష్ట్రంలో బీజేపీ నేత ఒక‌రు హ‌త్య‌కు గుర‌య్యారు. బాగ్‌పత్‌ జిల్లాకు చెందిన బీజేపీ కీలక నేత సంజయ్ ఖోఖర్‌ను ముగ్గురు గుర్తుతెలియ‌ని దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. మంగ‌ళ‌వారం ఉదయం అత‌డు గ్రామం నుంచి త‌న‌పొలానికి న‌డుచుకుటూ వెళుతుండగా గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు అత‌డిపై కాల్పులు జ‌రిపారు. దీంతో సంఘ‌ట‌న స్థ‌లంలోనే అత‌డు మృతి చెందాడు.

 

బాగ్‌పత్ ఛప్రౌలి పోలీస్ స్టేషన్ ప‌రిధిలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. సంజయ్ ఖోఖర్ ఒంటరిగా వెళుతున్న స‌మ‌యంలో అద‌ను చూసి దండుగులు కాల్చారు. స‌మాచారం అంతుకున్న వెంటనే పోలీసుల‌ బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది.ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. బీజేపీ నేత హ‌త్య‌పై సీఎం యోగి సీరియ‌స్ అయ్యారు.

 

ఈ కేసు చాలా వేగంగా విచారించి 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ అధికారులను ఆదేశించారు. కాగా, ఇదే ప్రాంతంలో గత నెలలో రాష్ట్రీయ లోక్‌దళ్‌ నాయకుడు దేశ్‌పాల్‌ ఖోఖర్‌ను కూడా గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు.

Leave a comment