విజయవాడలో జరిగిన స్వర్ణ ప్యాలెస్ హోటల్ దుర్ఘటన లో రమేష్ హాస్పటల్ చేసిన తప్పులు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఆ ప్రమాదంలో చనిపోయిన వారు ఆసుపత్రి నిర్లక్ష్యంతోనే చనిపోయారన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలోనే రమేష్ హాస్పటల్ ఎండీ రమేష్ చౌదరి పరారీలోనే ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు రమేష్ కజిన్ కుమారుడు అయిన హీరో రామ్ సీఎం జగన్‌ను ప్రశ్నిస్తూ తీవ్రంగా ట్విట్లతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే.
రమేష్ తనకు స్ఫూర్తి అని అలాంటి వ్యక్తిపై ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవడమేమిటి అన్నట్లు ట్విట్టర్ లో కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ కింద ఉండే కొందరు జగన్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని… ఫ్యూజ్ కాస్తా ఫీజు వైపు మరలుతోందని చివరకు ఫూల్స్ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ నేపథ్యంలో రామ్ అభిమానులతో పాటు కొందరు సినీ అభిమానులు, వైసీపీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా రామ్‌పై విరుచుకు పడుతున్నారు.
పది మంది చనిపోయినా మీరు మీ బాబాయ్‌ను ఎందుకు సమర్థిస్తున్నారంటూ వారు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే విజయవాడ నగర కమిషనర్ సూర్య చంద్ర రావు వీడియో వేదిక గా స్వర్ణ ప్యాలస్ ఘటన గురించి హీరో రామ్ స్పందించడం ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన గురించి దర్యాప్తు జరుగుతోన్న నేపథ్యంలో ఎవరైనా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే వారికి కూడా నోటీసులు జారీ చేస్తామని చెప్పారు.