విజ‌య‌నిర్మ‌ల బ‌యోపిక్ డైరెక్ట‌ర్ ఫిక్స్‌… న‌రేష్ షాకింగ్ డెసష‌న్‌

సీనియ‌ర్ హీరోయిన్, ద‌ర్శ‌క నిర్మాత విజ‌య నిర్మ‌ల అకాల‌మ‌ర‌ణం సూప‌ర్‌స్టార్ కృష్ణ‌కు తీర‌ని వ్య‌ధ‌ను మిగిల్చింది. ఇప్పుడు ఆమె జీవిత క‌థ ఆధారంగా ఆమె కుమారుడు న‌రేష్ ఓ సినిమా నిర్మించే ఆలోచ‌న‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే విజ‌య నిర్మ‌ల విగ్ర‌హాన్ని సైతం న‌రేష్ ఏర్పాటు చేశాడు. త‌న త‌ల్లి బ‌యోపిక్ చ‌రిత్ర‌లో నిలిచేపోయేలా నిర్మించాల‌ని న‌రేష్ ప్లాన్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ బ‌యోపిక్ కొన్ని కారణాల వ‌ల్ల స‌క్సెస్ కాలేదు. ఈ క్ర‌మంలో విజ‌య నిర్మ‌ల బ‌యోపిక్ విష‌యంలో ఎలాంటి పోర‌పాట్లు లేకుండా స‌క్సెస్ చేయాల‌ని న‌రేష్ ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడ‌ట‌.

 

ఈ సినిమాకు ద‌ర్శ‌కుడిగా ఎవ‌రు ? అయితే క‌రెక్ట్ అని త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డిన న‌రేష్ మ‌హాన‌టి ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ వైపే మొగ్గు చూపుతున్న‌ట్టు స‌మాచారం. నాగ్ అశ్విన్ ప్ర‌స్తుతం ప్ర‌భాస్ సైన్ష్ ఫిక్ష‌న్ ప్రాజెక్టుపై వ‌ర్క్ చేస్తున్నాడు. ఈ సినిమా కోస‌మే యేడాది పాటు నాగ్ అశ్విన్ ప‌ని చేయ‌నున్నాడు. ఈ సినిమా త‌ర్వాత మ‌రో ఆరేడు నెల‌లు విజ‌య నిర్మ‌ల క‌థ‌, ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌పై వ‌ర్క్ చేశాకే సెట్స్‌కు వెళితే బాగుంటుంద‌న్న‌దే నరేష్ ఆలోచ‌న అట‌. అయితే ఈ బ‌యోపిక్‌పై న‌రేష్ ఆలోచ‌న ఎలా ? ఉన్నా నాగ్ అశ్విన్ వైపు నుంచి ఎలాంటి క్లారిటీ ఉంద‌న్న‌ది మాత్రం తెలియ రాలేదు.

Leave a comment