Moviesటాప్‌ ద‌ర్శ‌కుడి ఇంట తీవ్ర విషాదం

టాప్‌ ద‌ర్శ‌కుడి ఇంట తీవ్ర విషాదం

ప్ర‌పంచ వ్యాప్తంగా ఎన్నో సంచ‌ల‌నాల‌కు మారు పేరు అయిన హాలీవుడ్‌ దిగ్గజ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ ఇంట విషాదం చోటు చేసుకుంది. పర్సనల్‌ కంప్యూటర్‌ ఆవిష్కర్త స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ తండ్రి ఆర్నాల్డ్‌ స్పిల్‌బర్గ్‌‌(103) మరణించారు. లాస్ ఏంజెల్స్‌లో మంగ‌ళ‌వారం కుటుంబ స‌భ్యులు ఆయ‌న మ‌ర‌ణ‌వార్త‌ను ప్ర‌క‌టించారు. ఆయ‌న‌కు ఈ వ‌య‌స్సులో కూడా ఎలాంటి ఆర‌గ్య స‌మ‌స్య‌లు లేవ‌ని.. స‌హ‌జ మ‌ర‌ణ‌మే అని వారు చెప్పారు. స్పీల్‌బ‌ర్గ్‌, చార్లెస్ ప్రాప్స్ట‌ర్ ఇద్ద‌రూ 1950లో జ‌న‌ర‌ల్ ఎల‌క్ట్రిక్ కోసం ప‌ని చేస్తోన్న క్ర‌మంలోనే జీఈ-225 మెయన్‌ఫ్రేమ్‌ కంప్యూటర్‌ని రూపొందించారు.

ఆ త‌ర్వాత దీనిని బేస్ చేసుకునే కంప్యూట‌ర్ శాస్త్ర‌వేత్త‌లు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బేసిక్‌ను డ‌వ‌ల‌ప్ చేశారు. ఇదే 1970-80ల్లో కంప్యూట‌ర్ త‌యారీకి ఉప‌యోగ‌ప‌డింది. నియన్ యూదు వలసదారుల కుమారుడైన ఆర్నాల్డ్ స్పీల్‌బర్గ్ 1917లో సిన్సినాటిలో జన్మించాడు. 15 ఏళ్ల వ‌య‌స్సులోనే ఓ హోమ్ రెడీయోను త‌యారు చేసిన స్పిల్‌బ‌ర్గ్‌కు ముగ్గురు భార్య‌లు, న‌లుగురు సంతానం. స్టీవెన్‌ స్పీల్‌బర్గ్(73) మొదటి సంతానం.

స్క్రీన్ రైటర్ అన్నే స్పీల్‌బర్గ్, నిర్మాత నాన్సీ స్పీల్‌బర్గ్‌, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ స్యూ స్పీల్‌బర్గ్. వీరంతా మొదటి భార్య లేహ్‌ స్పీల్‌బర్గ్‌ సంతానం. ఆమె 2017లో మరణించారు. మూడవ భార్య బెర్నిస్‌ కోల్నర్‌ స్పీల్‌బర్గ్‌ 2016లో మరణించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news