Moviesప్ర‌గ‌తి ఆంటీ డ్యాన్స్‌తో ఊపేస్తోందిగా... వీడియో వైర‌ల్‌

ప్ర‌గ‌తి ఆంటీ డ్యాన్స్‌తో ఊపేస్తోందిగా… వీడియో వైర‌ల్‌

టాలీవుడ్ నటి ప్రగతి ఈమద్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఆమె జిమ్ వ‌ర్కౌట్లు, జిమ్ వీడియోలు, ఫొటోల‌తో ప‌దే ప‌దే సంద‌డి చేస్తోన్న విష‌యం తెలిసిందే. ఇక సినిమాల్లో ఆమెను చూసిన దానికి, వీడియోల్లో ఆమెను చూసిన దానికి చాలా తేడా ఉండ‌డంతో సినీ జ‌నాలు షాక్ అవుతున్నారు. సినిమాల్లో ఆంటీ రోల్స్ వేసుకునే ప్ర‌గ‌తి ఆంటీ వ‌ర్కౌట్లు చూస్తే ఆమె ఇంత కుర్ర‌మ్మాయా ? అన్న‌ట్టుగా ఉంటుంది. ఇక తాజాగా ప్ర‌గ‌తి ఆంటీ బంటీ ఔర్ బబ్లీ సినిమాలోని కజురారే పాటకు డాన్స్ చేసింది.

 

ఆమె ఇప్ప‌టి వ‌ర‌కు పెట్టిన వీడియోల కంటే ఈ వీడియో మ‌రింత వైర‌ల్ అవుతోంది. నెట్టింట్లో ఆమె వ‌రుసగా వీడియోలు పెడుతుండ‌డంతో ఆమెకు ఫాలోవ‌ర్స్ పిచ్చ పిచ్చ‌గా పెరిగిపోతున్నారు. ఇక ఈ సోష‌ల్ మీడియా ఎంట్రీతో పాటు వ‌రుస‌గా వీడియోలు పోస్ట్ చేస్తుండ‌డంతో బిగ్‌బాస్ కోస‌మే ఆమె పాపుల‌ర్ అయ్యేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌న్న చ‌ర్చ న‌డిచింది. దీనికి ఆమె కౌంట‌ర్ ఇస్తూ త‌న‌కు బిగ్‌బాస్‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం లేద‌ని.. నాకు చెడ్డ పేరు లేదు… అలా అని డ‌బ్బు అవ‌స‌రం లేద‌ని కూడా చెప్పింది.

 

ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా ప్ర‌గ‌తి ఆంటీ జిమ్ వ‌ర్కౌట్లు, వీడియోలు చూస్తుంటే …. ఆమె ఇంత త‌క్కువ వ‌య‌స్సులో క‌నిపిస్తే ఆమెకు మ‌న టాలీవుడ్ వాళ్లు అమ్మ‌, అత్త పాత్ర‌లు ఎలా ఇస్తారు ? అన్న స‌ర‌దా జోకులు ఆమెపై పేలుతున్నాయి.

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news