పోలీసుల విచార‌ణ‌లో గుట్టు విప్పిన రియా… మ‌నీ లాండ‌రింగ్ ఉచ్చు

దివంగ‌త బాలీవుడ్ న‌టుడు సుశాంత్ రాజ్‌పుత్ గ‌ర్ల్‌ఫ్రెండ్ అయిన రియా చ‌క్ర‌వ‌ర్తి చుట్టూ ఇప్పుడు ఆరోప‌ణ‌లు ముసుకుంటోన్న సంగ‌తి తెలిసిందే. సుశాంత్ చ‌నిపోయిన ఇన్ని రోజుల‌కు సుశాంత్ కుటుంబ స‌భ్యులు సైతం రియాపై ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. సుశాంత్ తండ్రి కెకె. సింగ్ సైతం రియాపై ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా సుశాంత్ ఖాతా నుంచి రియా ఖాతాకు భారీగా డ‌బ్బు మ‌ళ్లింద‌న్న ఆరోప‌ణ‌ల‌పై కూడా ఇప్పుడు ఈడీ కూపి లాగుతోంది.

 

ఈడీ ఆమెకు నోటీసులు జారీ చేయ‌డంతో ఆమె విచార‌ణ‌కు హాజ‌రైంది. ఈ విచార‌ణ‌లో పోలీసులు ఆమె నుంచి ప‌లు స‌మాధానాలు రాబ‌ట్టిన‌ట్టు తెలుస్తోంది. ఇక సుశాంత్ ఖాతా నుంచి ఆమె ఖాతాకు ఎప్పుడెప్పుడు ఎంతెంత మళ్లింది ? ఆమెకు ముంబైలోని బాంద్రాలో ఉన్న రు. 85 ల‌క్ష‌ల విలువైన ప్లాట్ కొనేందుకు డ‌బ్బులు ఎలా ? వ‌చ్చాయి.. అన్న ప్ర‌శ్న‌లు కూడా సంధించార‌ని టాక్‌. ఇక రియాకు ముంబై పోలీసులు స‌హాక‌రిస్తున్నార‌ని బిహార్ ప్ర‌భుత్వం సుప్రీంకు విన్న‌వించిన నేప‌థ్యంలో ఇప్పుడు కేసు ఊపందుకుంది.

Leave a comment