బంగారం గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తోంది. వారం రోజుల్లో బంగారం రేటు ఏకంగా ఆరుసార్లు తగ్గింది. దీంతో బంగారం రేటు మరింత తగ్గుతుందని బంగారం ప్రియులు భావించారు. అయితే బంగారం రేటు బిగ్ షాక్ ఇచ్చింది. రేటు ఒక్కసారిగా పెరిగిపోయింది. హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో బంగారం రేటు రు. 610 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 54,270 కి చేరింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 560 పెరిగి రూ. 49,750 కు చేరింది.
బంగారం రేటు జోరు చూపించినా వెండి రేటు మాత్రం నిలకడగానే ఉంది. కేజీ వెండి రు. 50 తగ్గి రూ.65,500 కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధర బ్రేకులు లేకుండా పరుగులు పెడుతోంది. 24 క్యారెట్ల బంగారం రు. 820 పెరగడంతో 10 గ్రాములు రూ.55,200 చేరుకుంది. ఇక 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రు. 750 పెరిగి రూ.50,600 కి చేరుకుంది. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం ధర 1935 డాలర్ల పైకి చేరింది. వెండి ధర 27.09 డాలర్లకు చేరింది.