కాలేజ్‌టాపర్‌గా స‌న్నీలియోన్‌.. మార్కుల లిస్టులో గంద‌ర‌గోళం

పోర్న్‌స్టార్ స‌న్నీలియోన్ కాలేజ్ టాప‌ర్‌గా నిలిచింది. స‌న్నీలియోన్ ఏంటి కాలేజ్ టాప‌ర్‌గా నిల‌వ‌డం ఏంట‌ని షాక్ అవుతున్నారా ?  ఇది నిజ‌మే… క‌ల‌క‌త్తాలోని అండర్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశం కోసం నగరంలోని అషుతోష్‌ కాలేజీ ప్రకటించిన మెరిట్‌ జాబితాలో బాలీవుడ్‌ నటి సన్నీ లియోన్‌ కాలేజ్ టాప‌ర్‌గా నిలిచారు. బీఏ ( ఆన‌ర్స్‌) ప్ర‌వేశానికి నిర్వ‌హించిన ప‌రీక్ష‌లో స‌న్నీ పేరు టాప్‌లో రావ‌డంతో విద్యార్థులు అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.

దీంతో అంద‌రూ అవాక్క‌య్యారు. స‌న్నీ ఏంటి కాలేజ్ టాప్‌గా నిల‌వ‌డం ఏంట‌ని గంద‌ర‌గోళంలో ప‌డ్డారు. స‌న్ని మా కాలేజ్‌లో ఎప్పుడు జాయిన్ అయ్యింది మాకు తెలియ‌కుండా అని సోష‌ల్ మీడియాలో సైటైర్లు కూడా వేసుకుంటున్నారు. ఇది ఇప్పుడు భారీగా వైర‌ల్ అవుతోంది. ఇక ఈ లిస్టులో సన్నీ పేరుతో పాటు అప్లికేషన్ ఐడి, రోల్ నంబర్ కూడా ఉండటం గమనార్హం. ఆమెకు స‌బ్జెక్టుల్లో ఏకంగా 400 మార్కులు కూడా వ‌చ్చాయి.

ఇది గంద‌ర‌గోళానికి దారితీయ‌డంతో స్పందించిన కాలేజ్ యాజ‌మాన్యం ఎవ‌రో ఆక‌తాయిలు కావాల‌నే ఈ ప‌ని చేశార‌ని వివ‌ర‌ణ ఇచ్చుకుంది. కావాలనే ఎవరో తప్పుడు దరఖాస్తును సమర్పించారని వెల్లడించింది. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపింది.