కోవిడ్-19 వైరస్‌కు ఊబకాయంతో లింక్ ఉందా ? ఊబకాయం ఉన్న వారికి కోవిడ్ ముప్పు ఎక్కువుగా పొంచి ఉందా ? అంటే తాజా స్టడీల్లో అవును అన్న ఆన్సర్లే వినిపిస్తున్నాయి. తాజాగా కోవిడ్-19పై పరిశోధన చేస్తోన్న పలువురు నిపుణులు వెల్లడించిన విషయాల ప్రకారం కోవిడ్ రోగుల్లో చాలా మంది ఊబకాయం కలిగి ఉన్నారట. అసలు మానవుడికి ఊబకాయం అనేది ఎన్నో రకాల వ్యాధులకు కారణం అవుతుందన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఊబకాయం ఉన్న చాలా మందికి స్లీప్ అప్నియా (sleep apnea) లేదా ఊబకాయం హైపర్‌వెంటిలేషన్ సిండ్రోమ్ ఉందని నిపుణులు చెపుతున్నారు. ఈ కారణంగానే కరోనా రోగుల్లో చాలామంది కార్బన్ డయాక్సైడ్‌ను పీల్చుకోలేరట. ఈ కారణంగానే ఊబకాయంతో బాధపడేవారు కరోనా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. వీరు కరోనా వచ్చాక జాగ్రత్తపడడం కన్నా.. అసలు కరోనా రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
ఇక అసలు కరోనా వైరస్ సోకిన వారిలో మరికొన్ని కొత్త లక్షణాలు కూడా కనపడుతున్నాయి. కొందరిలో వ్యాధి లక్షణాలు లేకపోయినా కరోనా వస్తోంది. మరి కొందరిలో ఎంత ఆరోగ్యంగా ఉన్నా అకస్మాత్తుగా వెంటిలేషన్ అవసరం పడుతోంది. కొంతమందికి ఛాతిలో మంట రావడం.. మరికొందరిలో రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలు వస్తున్నాయి. మరి కొందరు మాత్రం ఎలాంటి వైద్యం లేకుండానే పాజిటివ్‌కు వచ్చేస్తున్నారు.