Politicsసాక‌ర్ ఆట‌గాడిని పెళ్లాడిన లేడీ ప్ర‌ధాని... వీరి ప్రేమ ఎంత గొప్ప‌దంటే...!

సాక‌ర్ ఆట‌గాడిని పెళ్లాడిన లేడీ ప్ర‌ధాని… వీరి ప్రేమ ఎంత గొప్ప‌దంటే…!

ఫిన్‌లాండ్ ప్రధాని సనా మారిన్ తన చిరకాల స్నేహితుడు, సాకర్‌ ఆటగాడు మార్కస్‌ రాయ్కెన్‌ను వివాహమాడారు. అత్యంత నిరాడంబ‌రంగా వీరి వివాహం జ‌రిగింది. ఈ విష‌యాన్ని ఆమె త‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు. తాను ప్రేమించే వ్య‌క్తితో జీవితం పంచుకుంటోన్నందుకు ఎంతో ఆనందంగా ఉంద‌ని చెప్పిన ఆమె త‌న ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పెళ్లి ఫొటోలు షేర్ చేశారు. క‌రోనా నేప‌థ్యంలో వీరి వివాహం అతికొద్ది మంది స‌మ‌క్షంలోనే జ‌రిగింది.

 

వీరి ప్రేమ‌కు ఎన్నో ప్ర‌త్యేక‌త‌లు ఉన్నాయి. వీరు 16 సంవ‌త్స‌రాలుగా క‌లిసి ఉంటున్నారు. ఈ దంప‌తుల‌కు ఎమ్మా అమైలా మారిన్‌ అనే రెండేళ్ల కూతురు ఉంది. తమ పద్దెనిమిదవ ఏటనే ప్రేమలో పడిన వీరు శనివారం వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇక స‌నా మారిన్ గ‌తేడాదిలో ఫిన్లాండ్ ప్ర‌ధాని అయ్యారు. ప్ర‌పంచంలోనే అత్యంత చిన్న వ‌య‌స్సులో అంటే 34 సంవ‌త్స‌రాల‌కే ఒక దేశ మ‌హిళా ప్ర‌ధాని అయిన ఘ‌న‌త ఆమె సొంతం చేసుకున్నారు.

 

సోషల్‌ డెమొక్రటిక్‌ పార్టీకి చెందిన ఆమె.. కాట్రీ కుల్ముని(32-సెంటర్‌ పార్టీ), లీ అండర్సన్‌(32- లెఫ్ట్‌ అలయన్స్)‌, మారియా ఓహిసాలో(34- గ్రీన్‌ లీగ్)‌, అన్నా మజా హెర్నిక్సన్(55- స్వీడిష్‌ పీపుల్స్‌ పార్టీ ఆఫ్‌ ఫిన్‌లాండ్‌) నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news