మానవ సమాజం ఎంత అభివృద్ధి చెందుతున్నా ఎన్నో రోగాలకు మందులు కనిపెట్టే శాస్త్ర సాంకేతికత అభివృద్ధి చెందుతున్నా మనిషి ఆయువు మాత్రం పెంచడం లేదు. పైగా ఈ ఒత్తిడి యుగంలో ఒకప్పుడు 100 ఏళ్లు బతికే వారు ఇప్పుడు గరిష్టంగా 60 ఏళ్లు మాత్రమే ( సరాసరీ) బతుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈక్వెడార్‌కు చెందిన ఓ వృద్ధ జంట ప్రపంచంలోనే అత్యధిక వయస్సు వరకు జీవించి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. వీరు గిన్నీస్ రికార్డులకు కూడా ఎక్కారు.
ఈ జంట పేర్లు జులియో సెసార్ మోరా టాపియా, వాల్డ్రమినా మక్లోవియా క్వింటెరాస్ రేయెస్. వీరిద్దరిలో జులియో వయసు 110 ఏళ్లు కాగా, వాల్డ్రామినా వయసు 104 ఏళ్లు. జులియో సెసార్ 10 మార్చి 1910లో జన్మించగా, వాల్డ్రామినా 16 అక్టోబరు 1915లో జన్మించారు. ఇద్దరి మొత్తం వయసు కలిపితే 214 సంవత్సరాలు. దీంతో గిన్నీస్ బుక్ ఈ వృద్ధ జంటకు తమ పుస్తకంలో చోటు కల్పించింది. 79 ఏళ్ల క్రితం వీరిద్దరు వివాహం చేసుకున్నట్టు గిన్నిస్ వరల్డ్ రికార్డు తెలిపింది.
ఇక వీరిద్దరు 1934లో ఏర్పడిన పరిచయంతో ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో వీరు 1941లో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఈ వృద్ధ జంటకు నలుగురు పిల్లలు, 11 మంది మనవళ్లు, 21 మంది మునిమనవళ్లు, మునిమనవడికి పుట్టిన ఓ చిన్నారి ఉన్నారు. వీరిద్దరు ఉపాధ్యాయులుగానే చేసి రిటైర్ అయ్యారు. వీరు ఈక్వెడార్ రాజధాని క్విటోలో ఉంటున్నారు. గతంతో పోలిస్తే కాస్త చురుకుదనం తగగినా ఇప్పటకీ చలాకీగానే ఉంటారని వీరి కుటుంబ సభ్యులు చెపుతుతున్నారు.