దివంగత బాలీవుడ్ యువ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత ఈ కేసులో క్షణానికి ఒక సందేహం బయటకు వస్తోంది. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ విచారిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని సైతం ఎప్పుడు అయినా సీబీఐ అరెస్టు చేయవచ్చన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇక ఈ కేసులో ముందు నుంచి విచారణ విషయంలో అనేక సందేహాలు లేవనెత్తుతోన్న బాలీవుడ్ క్వీన్, ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి సంచలన ట్వీట్‌తో బాలీవుడ్లో ప్రకంపనలు రేపుతోంది.
కంగన ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు, ముంబై పోలీసులతో పాటుగా సుశాంత్ మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించిన కూపర్ ఆస్పత్రిపై కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఇక కొద్ది సేపటి క్రితమే ఆమె మరో ట్వీట్ చేశారు. ఈ కేసును సీబీఐ త్వరగా ముగించాలని ఆదేశాలు ఇస్తోన్న ఆ బిగ్ఫిష్ను సీబీఐ వెంటనే పట్టుకోవాలని కంగన సూచనలు చేశారు. కంగన చేసిన ఆ ట్వీట్‌కు రిప్లేగా మరి కొందరు ఆ బిగ్ ఫిష్ ఎవరు ? అని కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ కేసులో సిద్దార్థ్ పితానితో పాటుగా సందీప్ సింగ్ ని సిబిఐ విచారణకు పిలిచింది. ఏదేమైనా కంగన చేసిన ఒకే ఒక్క ట్వీట్ ఇప్పుడు బాలీవుడ్లో ప్రకంపనలు రేపుతోంది. ఈ బిగ్ ఫిష్ ఎవరు ? ఎవరు ? అని ప్రతి ఒక్కరు గుసగుసలాడుకుంటున్నారు.