Politicsబాబు ఇచ్చిన‌ ఎమ్మెల్సీయే గ‌తా... సోము ఎమ్మెల్యేగా గెలిచేనా...?

బాబు ఇచ్చిన‌ ఎమ్మెల్సీయే గ‌తా… సోము ఎమ్మెల్యేగా గెలిచేనా…?

ఏపీ బీజేపీ అధ్యక్షుడుగా సోము వీర్రాజు బాధ్యతలు తీసుకున్నాక, రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. మొన్నటివరకు కన్నా లక్ష్మీ నారాయణ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు బీజేపీ కాస్త చంద్రబాబుకు అనుకూలంగా నడుస్తున్నారనే ప్రచారం బాగా జరిగింది. జగన్ మీద చంద్రబాబు ఏ విధంగా విమర్శలు చేస్తారో…అలాగే కన్నా, ఇతర బీజేపీ నేతలు విమర్శలు చేసేవారు. అలాగే రాజధాని విషయంలో కూడా కన్నా అమరావతికి మద్ధతుగానే ఉన్నారు.

 

కానీ సోము వీర్రాజు వచ్చాక పరిస్థితులు మారాయి. ఆయన రావడం రావడమే చంద్రబాబుని టార్గెట్ చేసి మాట్లాడటంతో, బీజేపీ జగన్‌కు అనుకూలంగా ఉందనే వాదనలు మొదలయ్యాయి. సోము వీర్రాజు పక్కా జగన్ మనిషి అని తెలుగు తమ్ముళ్ళు గట్టిగా చెబుతున్నారు. అందుకే సోము వీర్రాజు, జి‌వి‌ఎల్ లాంటి బీజేపీ నేతలు రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిదే అని కొత్త రాగం అందుకున్నారని చెబుతున్నారు.

 

అయితే టీడీపీని టార్గెట్ చేసిన సోము…తామే జగన్‌కు అసలైన ప్రత్యామ్నాయం అని, ఏపీలో తామే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నామని చెబుతున్న విషయం తెలిసిందే. అలాగే 2024 ఎన్నికల్లో తాము ఏపీలో అధికారంలోకి రావడం ఖాయమని మాట్లాడుతున్నారు. ఈ విషయంలో కూడా తమ్ముళ్ళు, సోముకు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. టీడీపీని లేకుండా చేయాలంటే ఎవరి వల్ల కాదని, ఈ విషయంలో సోము పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేస్తున్నారు.

 

అసలు బీజేపీ అధికారంలోకి రావడం సంగతి దేవుడెరుగు ముందు బీజేపీ ఓట్లు నోటాని దాటితే చాలు అంటున్నారు. ఇప్పటికీ సోము వీర్రాజుకు ఉన్న ఎమ్మెల్సీ పదవి చంద్రబాబు ఇచ్చిందే అని గుర్తుచేస్తున్నారు. పోనీ నెక్స్ట్ ఎన్నికల్లో ఏ బీజేపీ నేత ఎమ్మెల్యేగా గెలుస్తారో చెప్పాలని, కనీసం అధ్యక్షుడుగా ఉన్న సోము వీర్రాజు ఎమ్మెల్యేగా గెలిస్తే చాలని కౌంటర్లు ఇస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news