అమెరికాలోని మిస్ నాటా 2020 పోటీల్లో ప్రవాస భారతీయులు రాలు అయిన తారిక యెల్లౌలా రన్నరప్‌గా నిలిచారు. అమెరికాలోని నార్త్ అమెరికా తెలుగు అసొసియేషన్ ( నాటా ) ప్రతిభావంతులు, కొత్త వారిని ఎంకరేజ్ చేసే కార్యక్రమంలో ఈ పోటీ పెట్టింది. ఇందులో నాటా ప్రపంచ స్థాయి మిస్ నాటా పోటీలు నిర్వహించగా ఇక్కడ తారిక రన్నరప్‌గా నిలిచారు. ప్రత్యేకంగా తెలుగు వారి కోసం ఏర్పాటు చేసిన ఈ పోటీల్లో అమెరికాలోని న్యూజెర్సీలో నివాసముంటున్న పదహారేళ్ల తారిక యెల్లౌలా పాల్గొంది.
తారిక తాను చదువుతో పాటు నటన, తనకు ఎంతో ఇష్టమైన నృత్యాన్ని కూడా కొనసాగిస్తానని చెప్పారు. ఇక తాను ఈ స్థాయికి చేరుకోవడం వెనక తన తల్లిదండ్రులు వెంకట్, రోజా, గురువు మాళిని అయ్యర్ ప్రోత్సాహం ఎంతో ఉందని చెప్పింది. ఇక చిన్నప్పటి నుంచే తాను నాట్యం, అభినయం లాంటి వాటిల్లో శిక్షణ పొందానని.. తన సోదరి తాన్వికతో కలిసి ఎన్నో నృత్య ప్రదర్శనలు ఇచ్చానని చెప్పింది.