మ‌లుపు తిరుగుతోన్న సుశాంత్ కేసు.. హ‌త్య అంటూ కొత్త అనుమానం

దివంగ‌త బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ కేసులో ఇప్ప‌టికే సుశాంత్ ప్రియురాలు రియా చ‌క్ర‌వ‌ర్తిని సీబీఐ అధికారులు రెండు రోజులుగా విచారిస్తున్నారు. రియాను సీబీఐ సోమ‌వారం కూడా విచారించ‌నుంది. ఈ కేసులో స‌రికొత్త అనుమానాలు త‌లెత్తుతున్నాయి. నిన్న‌టి వ‌ర‌కు సుశాంత్‌ది ఆత్మ‌హ‌త్య అని చాలా మంది అనుకున్నా కొంద‌రు మాత్రం ఇది హ‌త్యే అంటూ సందేహాలు లేవ‌నెత్తారు.

Sushant Singh Rajput Case: Centre seeks to be a part of Rhea Chakraborty's  plea - The Economic Times

ఈ క్ర‌మంలోనే ఇప్పుడు ఈ కేసులో ఓ ప్ర‌త్య‌క్ష సాక్షి మాత్రం సుశాంత్‌ను హ‌త్య చేసి ఆత్మ‌హ‌త్య‌గా చిత్రీక‌రిస్తున్నార‌ని చెపుతుండ‌డంతో చాలా సందేహాలు క‌లుగుతున్నాయి. సుశాంత్ డెడ్ బాడీని తీసుకువెళ్లిన‌ కూప‌ర్ ఆసుప‌త్రికి చెందిన సిబ్బంది ఒక‌రు ఈ విష‌యాల‌ను జాతీయ మీడియాకు చెప్పిన‌ట్టుగా స‌మాచారం. సుశాంత్ మృతి త‌ర్వాత కూప‌ర్ ఆసుప‌త్రికి తీసుకు వెళ్లిన వైద్యులు సుశాంత్‌ది ఆత్మ‌హ‌త్య కాద‌ని.. హ‌త్యే అని చెప్పిన‌ట్టు స‌ద‌రు సాక్షి తెలిపారు.

Sushant Singh Rajput case: Mumbai police interrogates 14 people including  his friends and family | Hindi Movie News - Times of India

ఇక సుశాంత్ ఆత్మ‌హ‌త్య చేసుకుంటే అత‌డి నాలుక బ‌య‌ట‌కు రావ‌డంతో పాటు మ‌ల‌, మూత్రాలు కూడా బ‌య‌కు వ‌స్తాయ‌ని కాని సుశాంత్‌లో అత‌డి ల‌క్ష‌ణాలు ఏవీ క‌నిపించ‌లేద‌ని ఆ ప్ర‌త్య‌క్ష సాక్షి చెప్పిన‌ట్టు స‌మాచారం. ఇక సుశాంత్ కాలు ఒక‌టి స‌న్న‌గాను… మ‌రొక‌టి లావుగా ఉన్న విష‌యం కూడా తాను చూశాన‌ని… ఈ విష‌యాలు ఎవ‌రికి అయినా చెపితే తాన‌ను చంపేస్తాన‌ని బ‌య‌ప‌డి చెప్ప‌లేద‌ని స‌ద‌రు సాక్షి చెప్పిన‌ట్టు స‌మాచారం. ఏదేమైనా ఈ విష‌యాలు బ‌య‌ట‌కు రావ‌డంతో ఇప్పుడు సుశాంత్ మృతి విష‌యంలో లెక్క‌లేన‌న్ని సందేహాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.

Leave a comment