Moviesసుశాంత్‌ను సాంతం నాకేసిన రియా... ఆమె కోసం ఎన్ని కోట్లు ఖ‌ర్చు...

సుశాంత్‌ను సాంతం నాకేసిన రియా… ఆమె కోసం ఎన్ని కోట్లు ఖ‌ర్చు చేశాడంటే..

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్ మృతి త‌ర్వాత ఈ కేసులో రోజుకో సంచ‌ల‌న విష‌యం వెలుగులోకి వ‌స్తోంది. తాజాగా సుశాంత్ బ్యాంక్ లావాదేవీల‌కు సంబంధించి ఢిల్లీకి చెందిన ప్రముఖ ఆర్థిక ఫోరెన్సిక్ నిపుణుడు నమ్రత కనోడియా సుశాంత్‌ బ్యాంక్ స్టేట్ట్‌మెంట్‌‌లలో ఒకదాన్ని పరిశీలించారు. ఈ లావాదేవీల్లో డ‌బ్బులు అన్నీ ప‌ర‌యాణాలు, విలాసాలు, చారిటీల‌కు సాయం, ఆధ్యాత్మిక కార్య‌క‌లాపాల కోసమే ఖ‌ర్చు చేయ‌బ‌డింద‌ని ఆయ‌న చెప్పారు. ఇందులో ఎక్కువ మొత్తం కేవ‌లం రియా విలాసాలు, ఆమె సోద‌రుడి కోస‌మే ఖ‌ర్చు చేసిన‌ట్టు భావిస్తున్నారు.

ఇదే అంశంపై క‌నోడియా మాట్లాడుతూ సుశాంత్ బ్యాంక్ అక్కౌంట్ ప‌రిశీలించిన‌ప్పుడు వివిధ ప‌నుల కోసం ఈ ఖ‌ర్చు చేసిన‌ట్టు త‌మ దృష్టికి వ‌చ్చింద‌న్నారు. ఈ యేడాది గ‌త జ‌న‌వ‌రి నుంచి న‌వంబ‌ర్ వ‌ర‌కే ఏకంగా సుశాంత్ ఖాతా నుంచి రు 4.6 కోట్లు ఖ‌ర్చ‌య్యాయి. ఇందులో ప్ర‌యాణాల‌కు రు. 42 లక్ష‌లు, ఒక ఫామ్‌హౌస్‌కు 33 లక్షలు, వ్యక్తిగత విలాసాలకు 1.1 కోటి రుపాయాలు ఖర్చు చేసినట్లు తేలింది.

ఇక రియా కోసం, ఆమె సోద‌రుడి కోస‌మే రు. 10 ల‌క్ష‌లు ఖ‌ర్చ‌య్యాయ‌ని.. వారి విమానాల ఖ‌ర్చులు, రియా సోద‌రుడి హోట‌ల్ ఖ‌ర్చులు, ఆమె షాపింగ్‌, మేక‌ప్‌, ఇత‌ర ఖ‌ర్చుల క‌సం కూడా భారీగానే సుశాంత్ చేతి చ‌మురు వ‌దిలించుకున్నాడ‌ని తాము గుర్తించామ‌న్నారు. ఏదేమైనా రియా త‌న‌తో పాటు త‌న ఫ్యామిలీకి కూడా సుశాంత్ డ‌బ్బు భారీగా వాడేసింద‌నే అర్థ‌మ‌వుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news