ఇప్పటికే ఎన్నెన్నో మలుపులు తిరిగిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో సీబీఐ పలు కీలక విషయాలు రాబట్టే దిశగా విచారణ సీరియస్‌గా చేస్తోంది. ఇప్పటికే సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని రెండు రోజులుగా సుదీర్ఘంగా విచారిస్తోన్న పోలీసులు ఇప్పుడు మరి కొంత మంది అనుమానితులను సైతం విచారిస్తున్నారు. సోమవారం రియా వాట్సాప్‌లో బయటపడిన గోవాకు చెందిన డ్రగ్ డీలర్ గౌరవ్ ఆచార్యను విచారించనున్నారు.
సోమవారం గౌరవ్ ఆచార్య ముంబైలోని ఈడీ ఆఫీస్‌కు చేరుకున్నారు. ఉదయం 11 గంటల నుంచి గౌరవ్‌ను విచారిస్తున్నారు. ఇక సుశాంత్ మృతి కేసులో మాత్రమే కాకుండా మనీ లాండరింగ్, డ్రగ్స్ ఆరోపణలు కూడా రియాను చుట్టుముట్టాయి. దీంతో పోలీసులు రియాకు, గౌరవ్‌కు ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. ఇక ఈడీ పిలుపుతో ఇప్పటికే ముంబై చేరుకున్న గౌరవ్ సుశాంత్ మృతికి తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.
ఇక సుశాంత్‌తో తనకు అసలు పరిచయమే లేదని చెపుతున్నాడు. ఇక తాను రియాను 2017లో కలుసుకున్నానని గౌరవ్ చెపుతున్నాడు. ఇక రియా కూడా సోమవారం సీబీఐ అధికారుల ఎదుట హాజరయ్యారు. ఇక సుశాంత్‌తో సంబంధం లేకుండానే రియాకు డ్రగ్ డీలర్లతో లింకులు ఉన్నాయన్న సందేహం ఇప్పుడు గౌరవ్ మాటలతో తెలుస్తోంది. మరి సీబీఐ విచారణలో ఇంకెన్ని రహస్యాలు తెలుస్తాయో ? చూడాలి.