దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత అతడి గురించి రోజుకో సంచలన వార్త బయటకు వస్తోంది. ఈ క్రమంలోనే సుశాంత్ గురించి అతడి స్నేహితుడు శ్యామ్యూల్ హోకిప్ కొన్ని సంచలన విషయాలు బయట పెట్టడంతో పాటు కేదార్నాథ్ సినిమా షూటింగ్ టైంలోనే ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్ కుమార్తె సారా ఆలీఖాన్ – సుశాంత్ ప్రేమించుకున్నారని తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. సుశాంత్ నటించిన సోంచిరియా సినిమా వరకు కూడా వీరిద్దరి మధ్య ఈ అనుబంధం కొనసాగిందని చెప్పారు.
ఇక ఈ వార్తలపై బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ లేడీ కంగనా రనౌత్ సైతం ట్విట్టర్ వేదికగా స్పందించింది. సుశాంత్ – సారా లవ్ వ్యవహారం మీడియాకు కూడా తెలుసని ఆమె బాంబు పేల్చింది. వీరు అవుట్ డోర్ షూటింగ్‌లకు వెళ్లినప్పుడు సైతం ఒకే గదిలో ఉన్నారని చెప్పింది. ఏదేమైనా సుశాంత్ – సారా ప్రేమ వ్యవహారంపై గతంలోనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు వీటిపై శామ్యూల్ స్పందించడం.. వీటికి కంగన మద్దతు తెలపడంతో ఇవి నిజమే అన్న అంశానికి మరింత ఊతం ఇచ్చినట్లయ్యింది.