దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ డెత్‌సీన్‌ను పోలీసులు విచారణలో భాగంగా రీక్రియేట్ చేశారు. సుశాంత్ చనిపోయిన జూన్ 14న ఏం జరిగిందనే దానిపై సుశాంత్ హౌస్ కీపర్ నీరజ్ సింగ్ వాంగ్మూలం సేకరించారు. ఇక ఉదయం 8 గంటలకు సుశాంత్ గది నుంచి బయటకు వచ్చి నీరు అడగగా తాను తీసుకువెళ్లి ఇచ్చానని ఆ తర్వాత నవ్వుతూనే గదిలోకి వెళ్లారని నీరజ్ చెప్పాడు. ఇక ఉదయం 9.30 గంటలకు కొబ్బరినీళ్లు, జ్యూస్, అరటి పండ్లు తీసుకురమ్మని చెప్పగా తాను వాటిని తీసుకువెళ్లినా కేవలం కొబ్బరినీళ్లు మాత్రమే తాగారని సింగ్ చెప్పాడు.
ఆ తర్వాత ఉదయం 10.30 గంటలకు గదిలోకి వెళ్లి లాక్ చేసుకున్నాడని.. పిలిచినా స్పందన లేదని చెప్పాడు. ఆ తర్వాత ఫోన్ చేసినా ఎత్తలేదని.. ఆ వెంటనే ఈ విషయాన్ని సుశాంత్ సోదరి గది తలుపులు తెరవమని చెప్పగా తాము తలుపులు తీసేందుకు విఫల ప్రయత్నం చేశామన్నాడు. ఇక తర్వాత తాళాలు తీసే వ్యక్తిని తీసుకువచ్చినా అతడు కూడా తాళం తీయలేకపోయాడని.. ఆ తర్వాత తాము తలుపులు పగలగొట్టి లోపలకు వెళ్లామని చెప్పాడు.
ఈ లోగా సుశాంత్ సోదరి కూడా వచ్చారని.. తాము లోపలకు వెళ్లిన వెంటనే సుశాంత్ ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించాడని నీరజ్ సింగ్ వివరించాడు.. పోలీసులను పిలిపించామని తెలిపారు.ఇక్కడే చిన్న సందేహం కూడా సీబీఐ గుర్తించింది. సుశాంత్ హైట్ కు.. బెడ్ నుంచి హైట్ కు తేడా ఉందట.
సుశాంత్ హైట్ 5.10 ఫీట్లు మాత్రమేనని తెలుస్తోంది. ఈ క్రమంలోనే సుశాంత్ ఉరి వేసుకున్నాడా ? లేదా ? అపస్మారక స్థితిలోకి వెళ్లాక ఎవరైనా ఉరివేశారా ? అన్నది పెద్ద సందేహంగా ఉంది. దీంతో సుశాంత్‌ది హత్య అన్న సందేహం మరింతగా ముసురుకుంటోంది. ఇక ఇదే అంశంపై సుబ్రహ్మణ్యస్వామి ముందు నుంచి సుశాంత్‌ది హత్యే అని విమర్శలు చేస్తూ వస్తోన్న సంగతి తెలిసిందే.